Site icon NTV Telugu

Amit Shah : అమిత్ షా షెడ్యూల్ లో మార్పులు

Amit Sha

Amit Sha

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. రేపు మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట విమానాశ్రయం కు చేరుకోనున్నారు అమిత్ షా. అయితే.. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈరోజు రాత్రికి అమిత్ షా తెలంగాణకు రావాల్సి ఉంది. అయితే.. షెడ్యూల్‌లో మార్పు చోటు చేసుకోవడంతో రేపు మధ్యాహ్నం 12 గంటలకు బేగం పేట ఎయిర్‌పోర్ట్‌కి అమిత్ షా చేరుకుంటారు. అనంతరం.. 12.50కి గద్వాల చేరుకోనున్న కేంద్ర హోం మంత్రి.. 1.35 నిమిషాల వరకు గద్వాల సభలో పాల్గొననున్నారు. 1.45కు గద్వాల నుంచి నల్లగొండ బయలుదేరనున్న అమిత్‌ షా.. 2.45కు నల్లగొండ చేరుకుంటారు. 3.35 వరకు నల్లగొండ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పాల్గొననున్నారు.

Also Read : Virat Kohli: పరుగుల రారాజుకు అరుదైన గౌరవం.. జైపూర్లో కోహ్లీ మైనపు విగ్రహం ఏర్పాటు

3.40కి నల్లగొండ నుంచి బయలుదేరి 4.20 వరకు వరంగల్‌కు అమిత్‌ షా చేరుకుంటారు. 4.25 నుంచి 5.05 నిమిషాల వరకు వరంగల్ సభలో కేంద్ర హోం మంత్రి పాల్గొంటారు. 6 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కి అమిత్ షా చేరుకుంటారు. 6.10 గంటలకు హోటల్ కత్రీయలో మేనిఫెస్టోను అమిత్ షా విడుదల చేయనున్నారు. 6.45 నుంచి 7.45వరకు క్లాసిక్ గార్డెన్ లో ఎమ్మార్పీఎస్‌ సమావేశంలో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. సాయంత్రం 7.55 కి బేగం పేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి అహ్మదాబాద్‌కు అమిత్‌ షా బయలుదేరనున్నారు.

Also Read : Revanth Reddy: మనీ, మద్యంతో ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు..

Exit mobile version