Trolls on Virat Kohli’s Hundred in IPL: ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ బాదాడు. శనివారం జైపుర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 72 బంతుల్లో 113 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో 67 బంతుల్లో విరాట్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యంత నెమ్మదైన సెంచరీల్లో (ఐపీఎల్‌లో స్లోయెస్ట్ సెంచరీ) ఇది ఒకటి కావడం విశేషం. 2009లో మనీశ్ పాండే 67 బంతుల్లో శతకం చేశాడు. దీంతో సోషల్ మీడియాలో విరాట్ ఇన్నింగ్స్‌పై ట్రోలింగ్ మొదలైంది.
‘సెల్ఫిష్’ అంటూ విరాట్ కోహ్లీని నెటిజన్స్ విమర్శిస్తున్నారు. స్లో ఇన్నింగ్స్ (12 ఓవర్లు) ఆడాడని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. సెంచరీ కోసం కామెరూన్ గ్రీన్‌ను రనౌట్ చేయబోయడని మండిపడుతున్నారు. అయితే కోహ్లీ స్ట్రైక్‌రేట్‌పై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. ‘విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ చాలా బాగుంది. అయితే జట్టులోని మిగతా వారిలో ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్ దూకుడుగా ఆడలేకపోయారు. దినేశ్ కార్తిక్, మహిపాల్ లామ్రోర్ బ్యాటింగ్‌కే రాలేదు. దీంతో విరాట్ స్ట్రైక్‌రేట్ పడిపోయింది. ఇతర బ్యాటర్లు ఆదుకుంటే ఆ భారం కోహ్లీపై పడింది. కింగ్ ఫామ్‌పై ఎలాంటి అనుమానాలు లేవు. ఇన్నింగ్స్ చివరి వరకూ క్రీజ్‌లో ఉండాలనుకున్నాడు. భారీ మొత్తం వెచ్చించి తీసుకున్న కొందరు ప్లేయర్స్ మాత్రం నిరాశపరిచారు’ అని వీరూ వివరించాడు.
Also Read: Tillu Square: టిల్లుగాడిపై ప్రశంసలు కురిపించిన రామ్ చరణ్!
ఐపీఎల్‌లో స్లోయెస్ట్ సెంచరీ సాధించిన ఆటగాళ్ల జాబితాలో మనీష్ పాండే (67), విరాట్ కోహ్లీ (67) అగ్ర స్థానంలో ఉన్నారు. సచిన్ టెండూల్కర్ (66), డేవిడ్ వార్నర్ (66), జొస్ బట్లర్ (66) టాప్-5లో ఉన్నారు. ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసింది క్రిస్ గేల్. యూనివర్సల్ బాస్ 30 బంతుల్లో శతకం బాదాడు. గేల్ అనంతరం యూసఫ్ పఠాన్ (37), డేవిడ్ మిల్లర్ (38)లు ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదారు.