NTV Telugu Site icon

SL vs PAK: ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. భారత్ దరిదాపుల్లో కూడా లేదు!

Pakistan Record

Pakistan Record

Pakistan record the highest chase in ICC ODI World Cup: ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్‌ టోర్నీలో పాకిస్తాన్ చరిత్ర సృష్టించింది. వన్డే ప్రపంచకప్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా పాక్ నిలిచింది. వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 345 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన పాకిస్థాన్ ఈ రికార్డు (Pakistan Record Chase) ఖాతాలో వేసుకుంది. పురుషుల వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఇదే ఇప్పుడు అత్యధిక ఛేజింగ్‌. దాంతో ఐర్లాండ్ రికార్డు బద్దలు అయింది.

2011 వన్డే ప్రపంచకప్‌ ఎడిషన్‌లో బెంగళూరులో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ 328 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఇదే అత్యధిక ఛేజింగ్‌గా ఉంది. తాజాగా ఐర్లాండ్ రికారును పాకిస్తాన్ బ్రేక్ చేసింది. ఈ జాబితాలో బంగ్లాదేశ్ మూడో స్థానంలో ఉంది. 2019లో వెస్టిండీస్ నిర్ధేశించిన 322 లక్ష్యాన్ని బంగ్లా చేదించింది. 2015లో స్కాట్లాండ్ నిర్ధేశించిన 319 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా ఛేదించగా.. 1992లో జింబాంబ్వే నిర్ధేశించిన 313 లక్షాన్ని శ్రీలంక చేదించింది. ప్రపంచకప్‌ టోర్నీలో భారత్ 300 ప్లస్ స్కోర్ ఇప్పటివరకు సాధించలేదు. 2015లో జింబాబ్వే నిర్దేశించిన 286 పరుగుల లక్ష్యాన్ని భారత్ (288/4) ఛేదించింది.

Also Read: IND vs PAK: భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు ప్రత్యేక కార్యక్రమం.. హాజరుకానున్న సూపర్ స్టార్, మాస్టర్ బ్లాస్టర్!

ఈ మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 344 పరుగుల భారీ స్కోరు చేసింది. కుశాల్ మెండిస్ (122), సదీర సమరవిక్రమ (106) శతకాలతో చెలరేగారు. అనంతరం పాకిస్తాన్ 48.2 ఓవర్లలోనే మరో 6 వికెట్లు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. అబ్దుల్లా షఫీక్ (113), మహమ్మద్ రిజ్వాన్ (131 నాటౌట్) సెంచరీలు బాదారు. ఈ విజయంతో పాక్ ప్రపంచకప్‌ 2023లో రెండో విజయాన్ని అందుకుంది.