SL vs PAK: ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. భారత్ దరిదాపుల్లో కూడా లేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan record the highest chase in ICC ODI World Cup: ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ టోర్నీలో పాకిస్తాన్ చరిత్ర సృష్టించింది. వన్డే ప్రపంచకప్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా పాక్ నిలిచింది. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 345 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన పాకిస్థాన్ ఈ రికార్డు (Pakistan Record Chase) ఖాతాలో వేసుకుంది. పురుషుల వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఇదే ఇప్పుడు అత్యధిక ఛేజింగ్. దాంతో ఐర్లాండ్ రికార్డు బద్దలు అయింది.
2011 వన్డే ప్రపంచకప్ ఎడిషన్‌లో బెంగళూరులో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ 328 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఇదే అత్యధిక ఛేజింగ్‌గా ఉంది. తాజాగా ఐర్లాండ్ రికారును పాకిస్తాన్ బ్రేక్ చేసింది. ఈ జాబితాలో బంగ్లాదేశ్ మూడో స్థానంలో ఉంది. 2019లో వెస్టిండీస్ నిర్ధేశించిన 322 లక్ష్యాన్ని బంగ్లా చేదించింది. 2015లో స్కాట్లాండ్ నిర్ధేశించిన 319 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా ఛేదించగా.. 1992లో జింబాంబ్వే నిర్ధేశించిన 313 లక్షాన్ని శ్రీలంక చేదించింది. ప్రపంచకప్ టోర్నీలో భారత్ 300 ప్లస్ స్కోర్ ఇప్పటివరకు సాధించలేదు. 2015లో జింబాబ్వే నిర్దేశించిన 286 పరుగుల లక్ష్యాన్ని భారత్ (288/4) ఛేదించింది.
Also Read
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
ఈ మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 344 పరుగుల భారీ స్కోరు చేసింది. కుశాల్ మెండిస్ (122), సదీర సమరవిక్రమ (106) శతకాలతో చెలరేగారు. అనంతరం పాకిస్తాన్ 48.2 ఓవర్లలోనే మరో 6 వికెట్లు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. అబ్దుల్లా షఫీక్ (113), మహమ్మద్ రిజ్వాన్ (131 నాటౌట్) సెంచరీలు బాదారు. ఈ విజయంతో పాక్ ప్రపంచకప్ 2023లో రెండో విజయాన్ని అందుకుంది.
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!