Suryakumar Yadav: నేను వేసిన చివరి ఓవర్ మ్యాజిక్ కంటే.. మా కుర్రాళ్ల ఆటే ఆకర్షించింది: సూర్య
- మూడో టీ20లో భారత్ విజయం
- సూర్య సంచనల బౌలింగ్
- మా కుర్రాళ్ల ఆటే ఆకర్షించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryakumar Yadav Heap Praise on India Batters: తాను వేసిన చివరి ఓవర్ మ్యాజిక్ కంటే.. కుర్రాళ్లు ఆడిన ఆటతీరే బాగా ఆకర్షించిందని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. 200లకు పైగా స్కోర్లు చేసి విజయం సాధిస్తే ఎలా సంబరపడతామో.. 70 పరుగులకే సగం వికెట్లను కోల్పోయినా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఆటను ఆస్వాదించాలన్నాడు. తాను కేవలం కెప్టెన్‌గా ఉండటానికి రాలేదని, నాయకుడిగా ఉండాలనేదే తన కోరిక అని చెప్పాడు. మంగళవారం రాత్రి శ్రీలంకతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్ విజయంలో సూర్య కీలక పాత్ర పోషించాడు.
మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ… ‘చివరి ఓవర్ మ్యాజిక్ కంటే మా కుర్రాళ్లు బ్యాటింగ్ చేసిన ఆటతీరే నన్ను ఆకర్షించింది. బ్యాటింగ్‌లో 30/4, 48/5 స్కోరు సమయంలో మా కుర్రాళ్లు బాగా ఆడడంతో ప్రత్యర్థిపై పోరాడే అవకాశం మాముందుంది. ఈ పిచ్‌పై 140 పరుగులను కాపాడుకోవడం పెద్ద కష్టమేం కాదు. మేము ఫీల్డింగ్ చేసే సమయంలో మా ప్లేయర్స్‌కు ఒకటే చెప్పా. గంటన్నరలో చివరి నిమిషం వరకూ మనస్సును నిమగ్నం చేస్తే విజయం సాధించవచ్చని చెప్పాను. 200+ స్కోర్లు చేసి విజయం సాధిస్తే ఎలా సంబరపడతామో.. 70 పరుగులకే సగం వికెట్లను కోల్పోయినా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఆటను ఆస్వాదించాలి. అప్పుడే జీవితం సమతూకంగా అనిపిస్తుంది’ అని అన్నాడు.
Also Read
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! 'FIFA World Cup' గురించి తెలియని విషయాలు మీకోసం..
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Pat Cummins: "ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది".. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read: Paris Olympics 2024: బాయ్‌ఫ్రెండ్‌తో బయటకు వెళ్లింది.. ఒలింపిక్స్ నుంచి ఔట్ అయింది!
‘మా యువ ఆటగాళ్లకు ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. దీంతో నా పని తేలికైంది. గ్రౌండ్లో, డ్రెస్సింగ్ రూమ్‌లో పాజిటివ్ దృక్పథం ఉంది. గత మ్యాచ్‌కు ముందే కొందరికి విశ్రాంతి ఇస్తామని చెప్పాం. అందరికీ అవకాశం రావాలంటే అలా చేయాల్సిందే. సహచరుల కోసం ప్రతి ఒక్కరూ తమ స్థానాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఎప్పుడూ బ్యాటింగ్‌కు వెళ్లినా కాస్త ఒత్తిడిగా భావిస్తా. ఒక్కసారి కుదురుకుంటే.. ఆటను ఆస్వాదిస్తా. నేను కేవలం కెప్టెన్‌గా ఉండటానికి రాలేదు, నాయకుడిగా ఉండాలనేదే నా కోరిక. సహచర ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఫలితం రాబట్టేందుకు ప్రయత్నిస్తుంటా’ అని సూర్యకుమార్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
-
Vaibhav Sooryavanshi Record: వైభవ్ సూర్యవంశీకి గుడ్‌న్యూస్.. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డు బద్దలే!
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25% వద్ద యథాతథం.. లక్షలాది మంది రుణగ్రహీతలకు ఊరట
-
Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
-
వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..