Site icon NTV Telugu

Skanda Release Date: సలార్ ఎఫెక్ట్.. వెనక్కి స్కంద! రిలీజ్ ఎప్పుడో తెలుసా?

Skanda Movie

Skanda Movie

‎Ram Pothineni’s Skanda Movie New Release Date: ఉస్తాద్ రామ్‌, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘స్కంద’. అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో సెప్టెంబర్‌ 15న స్కంద చిత్రంను విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ తాజాగా పోస్ట్ పోన్ అయింది.

స్కంద సినిమాను సెప్టెంబర్‌ 28న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఎక్స్‌లో తెలిపింది. ‘ది మాసివ్ ఎనర్జిటిక్ స్ట్రోమ్ పర్ఫెక్ట్ డేట్‌లో వస్తోంది. స్కంద సినిమా సెప్టెంబర్‌ 28న థియేటర్లలో రిలీజ్ అవుతుంది. అన్ లిమిటెడ్ మాస్‌ను తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడలో చూడండి’ అని శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ తమ ఎక్స్‌లో పేర్కొంది. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: World Cup 2023: అందుకే శార్దుల్, అక్షర్‌లను తీసుకున్నాం: రోహిత్

సెప్టెంబర్‌ చివరి వారంలో రిలీజయ్యే ప్రభాస్ నటించిన ‘సలార్‌’ సినిమా పోస్ట్‌ పోన్‌ కాబోతుంది. అఫీషియల్‌గా ప్రకటన రాలేదు కానీ.. ఆల్‌మెస్ట్‌గా సలార్‌ పోస్ట్‌ పోన్‌ అయినట్లే అని ఇండస్ట్రీ టాక్‌. అదే డేట్‌ను స్కంద సినిమా రీప్లేస్‌ చేసింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్కంద సినిమా రైట్స్ కొనుగోలుచేశారు. ఆయన కోరిక మేరకే స్కంద రెండు వారాలు వెనక్కి వెళ్లిందట. సలార్‌ పోస్ట్‌ పోన్‌ కావడంతో ఏ రోజే స్కందటిప్ పాటుగా మరో 2-3 సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయని సమాచారం.

Exit mobile version