తమిళనాడులో ఓ టిప్పర్ బీభత్సం సృష్టించింది. రాష్ట్రంలోని చెంగల్‌పట్టులో ఇవాళ (శుక్రవారం) జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. టిప్పర్ లారీ డ్రైవర్ వాహనంపై అదుపు తప్పి ద్విచక్ర వాహనాలను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. లారీ అతివేగంతో రావడంతో వల్లే మూడు ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
Read Also: Jailer Records: రజినీ దెబ్బకి ఈ రికార్డులు బద్దలయ్యాయి…
అయితే, టిప్పర్ లారీ పాదచారులను కూడా ఢీకొట్టింది. ప్రమాదంలో తొమ్మిది మంది గాయపడ్డారు.. గాయపడిన వారిని జిల్లా ఆసుపత్రి సహా చెంగల్పట్టులోని వివిధ ఆసుపత్రులలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది అని డాక్టర్లు తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని చెంగల్‌పట్టులోని పోలీసులు తెలిపారు.
Read Also: Wine Shop Tenders: వైన్ షాపుల టెండర్లకు అనూహ్య స్పందన.. ఆ ఒక్కరోజే 3140 అప్లికేషన్లు
దీంతో ప్రమాద సంఘటన ప్రదేశంలో బీభత్సమైన వాతావరణం నెలకొంది. అరుపులు, హాహా కారాలు, రక్తం మరకలు, మాంసముద్దలుగా ఆ ప్రాంతం అంతా భయానకంగా తయారయ్యింది. అయితే, ఈ సంఘటనలో ఇప్పటికే ఆరుగురు మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. తొమ్మిది మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. చెంగల్ పట్టు కుదువాంచేరి సమీపంలోని పోతేరి ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది అని పోలీసులు తెలిపారు. టిప్పర్ లారీ తిరుచ్చి నుంచి చెన్నె వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
