PM Modi New Cabinet: పీఎం మోడీ కొత్త మంత్రివర్గంలో ఆరుగురు మాజీ సీఎంలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi New Cabinet: లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి గెలిచిన ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఈ రోజు రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి అనేక మంది అతిథులు హాజరయ్యారు. ప్రధానితో సహా 71 మంది మంత్రులతో మోడీ కొత్త కేబినెట్ ఏర్పడింది. ప్రధానిగా మోడీతో పాటు కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్, మనోహర్ లాల్ కట్టర్ తదితరులు కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
ఎన్డీయేలోని మిత్ర పక్షాలకు 11 మందికి మంత్రి పదవులు దక్కాయి. మంత్రి మండలిలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం లభించే విధంగా ఓబీసీ నుంచి 27 మంది, షెడ్యూల్డ్ కులాల నుంచి 10 మంది, షెడ్యూల్డ్ తెగల నుంచి ఐదుగురు, మైనారిటీల నుంచి ఐదుగురుకి మంత్రి పదవులు దక్కాయి.
Also Read
- ‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
- AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
- 200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
READ ALSO: PM’s Oath Event: ప్రధాని మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో తళుక్కుమన్న తారలు, పారిశ్రామికవేత్తలు
ప్రస్తుతం మోడీ కేబినెట్‌లో ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. మూడు సార్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్, హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ కట్టర్, యూపీ మాజీ సీఎం రాజ్‌నాథ్ సింగ్, అస్సాం మాజీ సీఎం సర్బానంద సోనోవాల్, బీహార్ మాజీ సీఎం జీతన్ రామ్ మాంఝీ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఉన్నారు. ప్రధాని నరేంద్రమోడీ కూడా గతంలో గుజరాత్ సీఎంగా పనిచేయడం గమనార్హం.
బీజేపీ నుంచి అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, ధర్మేంద్ర ప్రధాన్, భూపేందర్ యాదవ్, అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ సింగ్, మరియు ప్రహ్లాద్ జోషి ఉన్నారు.
తాజావార్తలు
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!