NTV Telugu Site icon

BRS MLCs In Congress: బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు..

Brs Mlcs

Brs Mlcs

BRS MLCs In Congress: బీఆర్‌ఎస్‌ పార్టీకి వరుస షాక్స్ తగులుతున్నాయి. ఇప్పటి వరకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే కాంగ్రెస్‌లో చేరగా.. రాజ్యసభ సభ్యుడు కే. కేశవ్ రావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న మరుసటి రోజే ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌ లో జాయిన్ అయ్యారు. గురువారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ చేరుకున్న తర్వాత జూబ్లీహిల్స్‌లోని తన క్యాంపు కార్యాలయంలో వారిని హస్తం పార్టీలో చేర్చుకున్నారు. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల్లో బస్వరాజు సారయ్య, భానుప్రసాదరావు, ఎగ్గె మల్లేశం, ఎం.ఎస్.ప్రభాకర్, దండె విఠల్, బొగ్గారపు దయానంద్ ఉన్నారు.

Read Also: Assam Flood: అస్సాంలో భారీ వరదలు.. 29జిల్లాల్లో 21 లక్షల మందికి నిరాశ్రయులు.. ఆరుగురి మృతి

కాగా, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్షీ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డిల సమక్షంలో సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువాలు కప్పి ఆరుగురు ఎమ్మెల్సీలను పార్టీలోకి ఆహ్వానించారు. వాస్తవానికి అసెంబ్లీ, బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్సీల చేరికపై గత నెలలోనే జోరుగా చర్చలు జరిగాయి. వీరంతా వారం రోజుల ముందే పార్టీలో చేరాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల గురువారం అర్థరాత్రి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

అయితే, మరోవైపు ఈ నెలలోనే బడ్జెట్‌ సమావేశాలు స్టార్ట్ కానున్నాయి. ఒకవైపు ఆషాఢమాసం వస్తుండటంతో ఆషాఢ అమావాస్యకు ముందురోజు రాత్రి వీరంతా బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో జాయిన్ అయ్యారు. వీరి చేరికతో మండలిలో కాంగ్రెస్‌ బలం ఏకంగా 12కు చేరింది. కాగా, సీఎం నివాసానికి చేరుకోవడానికి ముందు ఆరుగురు ఎమ్మెల్సీలు దస్‌పల్లా హోటల్‌లో భేటీ అయ్యారు. అక్కడి నుంచి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు.