Site icon NTV Telugu

Health Tips: ఆహారం విషయంలో ఈ పొరపాట్లు చేస్తే.. ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్లే..!

Health Tips

Health Tips

ఉరుకుల పరుగుల లైఫ్ లో సమయానికి తినకుండా ఎలా పడితే.. అలా ఆహారం తీసుకుంటారు. అలాంటి ఆహారం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే, మన పుర్వికులు భోజనానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు.. తినే ముందు అది ఆరోగ్యానికి మంచిదా కాదా అని బేరీజు వేసుకుని.. టైంకి సరియైన భోజనం చేస్తూ ఎంత వయసు పైబడినప్పటికీ ఆరోగ్యంగా ఉండేవారు. కానీ నేటీ తరం అందుకు పూర్తిగా వ్యతిరేకం. సమయానుకూలంగా ఆహారం తినడం ఎప్పుడో మానేశారు. తినే తిండి మనకి ఆరోగ్యాన్ని ఇస్తుందో, అనారోగ్యాన్ని తెస్తుందో కూడా పట్టించుకోకుండా.. ఆ నిమిషానికి ఏది తినాలనిపిస్తే అది తింటూ తమ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.

Read Also: Andhra Pradesh: నా పెళ్లి ఆపండి.. ఫేస్‌బుక్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన బాలిక..

ఆహారం విషయంలో ఇలాంటి అలవాట్లు ఉంటే అది మీ ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అందుకే ఇలాంటి అలవాట్లు లేకుండా చూసుకోండి.. భోజనం విషయంలో మనం టైంకి ఎక్కువ వ్యాల్యూ ఇవ్వాలి. రాత్రి పడుకోవడానికి రెండు గంటల ముందే భోజనం చేయాలి.. అలాగే రాత్రి భోజనం ఎంత తేలికగా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది కూడా.. అంతేకానీ అర్ధరాత్రి 11 గంటలకు లేట్ నైట్ పార్టీలు అంటూ చికెన్లు, మటన్లు తింటే అది ఆరోగ్యానికి చాలా డేంజర్.. అలాగే విపరీతంగా జంక్ ఫుడ్ తీసుకోవడం కూడా ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం.

Read Also: Detective Teekshana Trailer: ఉపేంద్ర భార్య నటవిశ్వరూపం.. డిటెక్టివ్ గా అదరగొట్టింది

కొందరు ఆ ఫుడ్ మీద ఇష్టంతో పరిమితికి మించి తినేస్తారు.. ఆ తర్వాత శరీరానికి సరిపడిన వ్యాయామం చేయకపోవడంతో స్థూలకాయానికి.. ఆపై హృదయ సంబంధిత వ్యాధుల బారిన పడతారు. అలాగే ప్రాసెస్డ్ ఫుడ్, డీప్ ఫ్రై చేసిన ఫుడ్ ఒంటికి అంత మంచిది కాదు.. అలాగే డిప్రెషన్ లో ఉన్నవాళ్లందరూ ఎంత తింటున్నామో తెలియకుండా అదే పనిగా తింటూనే ఉంటారు. అలాంటి వాళ్ళు ఒకసారి వారి తిండిపై ప్రత్యేక దృష్టి పెట్టుకోవాలి. ఎందుకంటే అతిగా తినటం వల్ల.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో మనం అనుభవిస్తేనే కానీ తెలియదు.. అంతదాకా తెచ్చుకునే కంటే ముందే జాగ్రత్త పడటం అవసరం అని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.

Exit mobile version