Site icon NTV Telugu

Parasakthi : శివకార్తీకేయన్ ‘పరాశక్తి’ ఓవర్సీస్ రివ్యూ..

Parasakthi

Parasakthi

శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం ‘పరాశక్తి’ (Parasakthi) పొంగల్ స్పెషల్‌గా జనవరి 10, 2026న థియేటర్లలో విడుదల అయింది. సుధా కొంగర దర్శకత్వంలో జయం రవి, అథర్వ, శ్రీలీల, వంటి స్టార్స్ తో భారీ మల్టీస్టారర్ గా రూపొందిన ఈ చిత్రం, తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమానికి సంబంధించిన నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. సెన్సార్ టీమ్ నుండి అనేక ఇబ్బందులు ఎదురుకుని ఫైనల్ గా ఈ గడచిన శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది పరాశక్తి.

Also Read : OTT : ఈ వారంలో ఓటీటీలో 30కి పైగా సినిమాలు, సిరీస్‌లు సందడి

తమిళనాడులో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా తెరిక్కింది పరాశక్తి. మాతృభాష గొప్పతనం తెలియజేస్తూ హిందీ భాషను బలవంతంగా తమపై రుద్దడానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఓ ఉద్యమం ప్రారంభిస్తారు. ఆ ఉద్యమానికి వ్యతిరేకంగా పని చేసింది ఎవరు, తమిళనాడు కేంద్రంగా జరిగిన ఆ ఉద్యమంలో చివరికి ఎవరు గెలిచారు అనేది ‘పరాశక్తి’ సినిమా. సినిమా ఓపెనింగ్ షాట్ తోనే పీరియడ్ సెటప్‌తో నేరుగా కథలోకి వెళ్తుంది, కానీ ఆ సెటప్ తర్వాత చాలా నెమ్మదిగా సాగే కథనం మరియు ఎక్కువ సమయం తీసుకునే, విసుగు పుట్టించే ప్రేమ కథ సినిమా నెమ్మదిస్తుంది. చాలా ల్యాగ్ తో పాటు బోర్ ఫీల్ అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ పర్లేదు. సెకండాఫ్ కూడా అదే స్లో నేరేషన్ తో సాగతీసిన సన్నివేశాలు, బోరింగ్ స్క్రీన్ ప్లే తో సహనాన్ని పరీక్షిస్తుంది. మాతృబాష భాషా ఉద్యమం చుట్టూ ఉన్న భావోద్వేగాలు అంతగా స్ట్రాంగ్ గా అనిపించవు. సుధ కొంగర ధైర్యంగా హానెస్ట్ గా కథ రాసుకున్నప్పటికి స్క్రీన్‌ప్లేలో తేడా కొట్టింది. ఇక శివ కార్తీకేయన్ బాగా నటించాడు, జయం రవి పాత్రకు సరైన నేపధ్యం లేదు.అథర్వ పాత్ర ఒకే. శ్రీలీల చాలా బాగా చేసింది. సొంతగా చెప్పిన డబ్బింగ్ కూడా బాగుంది. మొత్తానికి విజయ్ సినిమా పోస్ట్ పోన్ అవడంతో భారీ ఎత్తున రిలీజ్ అయిన పరాశక్తి వీక్ స్క్రీన్ ప్లేతో శక్తి చూపించలేక పోయింది.

Rating : 2.5/5

Exit mobile version