Site icon NTV Telugu

Sivakarthikeyan: ‘ప్రిన్స్’ విషయంలో ‘అను’భవమైంది

Prince

Prince

Sivakarthikeyan: ‘పిట్ట గోడ’ సినిమాతో దర్శకుడిగా పరిచమైన అనుదీప్ జాతిరత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించింది. కరోనా తర్వాత బ్లాక్ బస్టర్ గా నిలిచిన జాతిరత్నాలు సినిమా రికార్డు సృష్టించింది. ఎటువంటి అంచనాలు లేకుండానే విడుదలై ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఇండస్ట్రీలో అనుదీప్ పేరు మారుమ్రోగిపోయింది.

Read Also: karthi – Sardar Part 2: సీక్వెల్స్‎ మీద సీక్వెల్స్ .. జోరు మీదున్న హీరో కార్తీ

తాజాగా ఇప్పుడు అనుదీప్ కేవి తమిళ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా ‘ప్రిన్స్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. దివాళీ సందర్భంగా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్ డ్ రెస్పాన్స్ అందుతుంది. నిజానికి జాతిరత్నాలు సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడానికి కాస్టింగ్ ఎంపిక ప్రధాన కారణం. నటినటుల కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుండటం సినిమాకి చాలా బాగా ప్లస్ అయింది.

Read Also: Rakul Preet Son Gay : కొడుకు ‘గే’ అని తెలిస్తే చెంపపగుల కొడతానన్న రకుల్ ప్రీత్

ప్రిన్స్ విషయంలో కూడా అనుదీప్ అంతే ఫన్ జనరేట్ చేయాలని ప్రయత్నించారు కానీ అటు తెలుగులో మాత్రమే కాక ఇటు తమిళ్ లో కూడా సినిమా హిట్ అవ్వలేదు. చాలామంది శివ కార్తికేయన్ ఈ సినిమాకి సరైన ఛాయిస్ కాదని చెబుతున్నారు. శివ కార్తికేయన్ స్థానంలో తెలుగు హీరో ఉండి ఉంటే సినిమా కనీసం హిట్ అయ్యేదని వారి అభిప్రాయం. ఇక శివ కార్తికేయన్ అభిమానులకు కూడా ఈ సినిమా నచ్చలేదు. పూర్తి తెలుగు ఓరియంటేషన్ ఉన్న సినిమా అయ్యుంటే బాగుండేదని శివ కార్తికేయన్ అభిమానులు సైతం ఒప్పుకుంటున్నారు.

Exit mobile version