Siva Karthikeyan: అడగకుండానే 50 లక్షల సాయం.. ఊరికే అయిపోతారా స్టార్లు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటనతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకోవడం ఒక ఎత్తయితే, ఆపదలో ఉన్న తోటి కళాకారుడికి అడగకుండానే సాయం చేసి, ఆ కృతజ్ఞతను కూడా ఆశించని నైజం శివకార్తికేయన్‌ది అనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అసలు విషయం ఏమిటంటే తమిళ నటుడు ప్రేమ్ కుమార్ కుమారుడు విదేశాల్లో ఉన్నత చదువుల కోసం అడ్మిషన్ సంపాదించారు. అయితే, విదేశీ విద్యకు అయ్యే భారీ ఖర్చు కోసం బ్యాంకును ఆశ్రయించారు. ఎడ్యుకేషన్ లోన్ మంజూరు కావాలంటే బ్యాంకు వారు ‘ష్యూరిటీ’ అడిగారు కానీ దురదృష్టవశాత్తూ, అప్పటికే తన ఇల్లు ఈఎంఐ (EMI) లో ఉండటంతో, మరే ఇతర ఆస్తిని హామీగా చూపలేక తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. తన కొడుకు భవిష్యత్తు ఏమైపోతుందో అన్న ఆందోళనలో ఆయన ఉన్నారట.
Also Read:Land Dispute Turns Violent: స్థల వివాదం.. ఐదుగురు మహిళలపై విచక్షణారహితంగా దాడి..
Also Read
- Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
- Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
అయితే శివకార్తికేయన్‌ను కలిసినప్పుడు, ప్రేమ్ కుమార్ తన పరిస్థితిని వివరించారు. సహాయం చేయమని ఆయన అడగలేదు కానీ, శివకార్తికేయన్ ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్నారు. ప్రేమ్ కుమార్‌కు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా, శివకార్తికేయన్ ₹50 లక్షల రూపాయలను బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి, దానిని ప్రేమ్ కుమార్ కుమారుడి చదువు కోసం ష్యూరిటీగా సమర్పించారు. ఒక స్టార్ హీరోకు ₹50 లక్షలు అనేది చిన్న మొత్తం కాకపోవచ్చు, కానీ ఎటువంటి గ్యారెంటీ లేకుండా, కేవలం మానవత్వంతో అంత పెద్ద మొత్తాన్ని ఇవ్వడం శివకార్తికేయన్ గొప్పతనానికి నిదర్శనం అని అంటున్నారు. అంతేకాక ఈ సాయం గురించి శివకార్తికేయన్ ఎక్కడా గొప్పలు చెప్పుకోలేదు. ప్రేమ్ కుమార్ అప్పు తీర్చే వరకు కనీసం ఒక్క మాట కూడా ఆ డబ్బు గురించి అడగలేదట. “ఈ రోజు నా కొడుకు నెలకు ₹5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడంటే.. దానికి కారణం శివ పెట్టిన భిక్ష. ఆ రోజు ఆయన ఆదుకోకపోతే నా కొడుకు భవిష్యత్తు అంధకారమయ్యేది.” అని ప్రేమ్ కుమార్ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. రూపాయి సాయం చేస్తే వంద మందికి తెలిసేలా ప్రచారం చేసుకునే లోకంలో మనం ఉన్నాం కానీ, ఎడమ చేత్తో చేసే సాయం కుడి చేతికి తెలియకూడదు అన్న సామెతను శివకార్తికేయన్ నిజం చేశారు.
తాజావార్తలు
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
-
Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
ట్రెండింగ్
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!