NTV Telugu Site icon

Sita Mandir: బీహార్ లో సీతా మందిర్.. రాజకీయాల కోసమేనా?

Sita

Sita

Sita Mandir Construction in Bihar: ప్రజల మనసు దోచకోవడానికి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రామ మందిరంతో హిందువులకు దగ్గరైన బీజేపీ తరహాలోనే సీతా మందిర్ కట్టి వారికి దగ్గరవ్వాలని జేడీయూ భావిస్తున్నట్లు ఉంది. దీని కోసం సీతా దేవి జన్మించినట్లు చెబుతున్న సీతామర్హి జిల్లాలోని పునారా ధామ్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. దీని కోసం మంత్రి వర్గ సమావేశంలో  రూ.72.47 కోట్లకు ఆమోదం తెలిపారు.

సీతామర్హి జిల్లా పునౌర ధామ్ ఆలయ అభివృద్ధి పథకం కింద ‘సీతా వాటిక’, ‘లవ్-కుష్ వాటిక’, కెఫెటేరియా, ల్యాండ్‌స్కేపింగ్ రోడ్డు తదితర నిర్మాణాలు చేపడతామని చెప్పారు. అయితే దీని వల్ల అయినా జేడీయూ మళ్లీ అధికారంలోకి వస్తుందో లేదో చూడాలి. దీని గురించి బీహార్ మంత్రి బిజేంద్ర ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ రాముడిలాగా సీతా మాత జన్మస్థలాన్ని అభివృద్ధి చేయడంపై కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని అన్నారు. అందుకే తమ ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుందన్నారు.

Also Read: G20 Summit: భారత్ బయలుదేరిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. ఢిల్లీ వీధుల్లో తిరగనున్న ‘ది బీస్ట్‌’!

ఇక నితీశ్ కుమార్ అందరి కోసం ఈ పనిచేశారని జేడీయూ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రంజన్ అన్నారు. పునారా ధామ్ అభివృద్ధి పథకానికి రాజకీయాలకు సంబంధం లేదన్నారు. బీజేపీ గుడి, మసీదులపై రాజకీయాలు చేసి మత ఉద్రిక్తతలను ప్రోత్సహిస్తోందని ఆయన మండిపడ్డారు.

ఇక దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ మహాకూటమికి సీతామందిర్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు. ఇంత వరుకు ఈ విషయాన్ని పట్టించుకోని వారు ఇప్పుడే ఎందుకు తెరపైకి తెచ్చారో ప్రజలందరికి తెలుసన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రామ మందిర నిర్మాణాన్ని చేపట్టిందని, పునారా ధామ్‌ను అభివృద్ధి చేయాలని నితీశ్‌ కుమార్‌ చాలాసార్లు మాట్లాడారని, ఇప్పటి వరకు ఏమీ జరగలేదన్నారు రాకేష్ కుమార్.ఇక ఈసారి అయినా సీతా మందిరాన్ని నితీశ్ పూర్తి చేస్తారో లేదో చూడాలి.