NTV Telugu Site icon

Tirumala Laddu Issue: రేపు సిట్ బృందం తిరుపతికి రాక

Sit

Sit

Tirumala Laddu Issue: తిరుమల మహా ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ అంశంపై విచారించేందుకు ఏర్పాటైన సిట్ బృందం రేపు తిరుపతిలో మొదటిసారిగా భేటీ కానుంది. సిట్ బృందాన్ని ఏర్పాటు చేస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. నూతనంగా ఏర్పాటైన సిట్ బృందం శనివారం తిరుపతిలో మొదటిసారిగా భేటీ అయిన తర్వాత విచారణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించుకున్నారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో పోలీసులు నమోదు చేసిన కల్తీ నెయ్యి కేసును సిట్ బృందం స్వాధీనం చేసుకోనుంది. కేసును సిట్ స్వాధీనం చేసుకున్న అనంతరం ఆ కేసు విచారణ అధికారిగా ఒక డీఎస్పీ స్థాయి అధికారిని సిట్ చీఫ్ నియమించనున్నారు. సిట్ విచారణ పూర్తి అయ్యేంతవరకు సిట్ బృందానికి కావలసిన భవనాలు, ఆఫీస్ మెటీరియల్, కంప్యూటర్ వంటి వస్తువులను టీటీడీ కల్పించనుంది. రెండు మూడు రోజుల్లో సిట్‌ బృందం మౌలిక వసతులను సమకూర్చుకొని విచారణను వేగవంతం చేయనుంది. మొదటిసారిగా సమావేశం అవుతున్న సిట్ బృందానికి సిట్ చీఫ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి దిశా నిర్దేశం చేయనున్నారు.

Read Also: AP Excise Policy: ఏపీలో నూతన ఎక్సైజ్ పాలసీ అమలుకు యంత్రాంగం సిద్ధపడాలి..

Show comments