NTV Telugu Site icon

SIT Team: ఏపీలో పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లపై మరిన్ని కేసులు నమోదు..

Palnadu

Palnadu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లపై సిట్ చీఫ్ నివేదిక సిద్ధం చేస్తున్నారు. నేడు ప్రాథమిక నివేదికను రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ ఇవ్వనున్నారు. ఇప్పటికే అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో కేసుల విచారణపై సమీక్ష పూర్తి చేసిన సిట్.. కేసుల విచారణపై ఇకపై కూడా పరివేక్షణ కొనసాగించనుంది. రానున్న రోజుల్లో మరింత లోతుగా విచారణ చేయనున్నట్లు సిట్ ప్రకటించింది. కాగా, డీజీపీకి నివేదిక సమర్పించిన తర్వాత సిట్ అధికారులు ప్రెస్ నోట్ విడుదల చేయనున్నారు. అల్లర్లపై సిట్ విచారణలో కీలక అంశాలపై ఫోకస్ పెట్టింది.

Read Also:Israel Gaza War : గాజాపై మరోసారి ఇజ్రాయెల్ విధ్వంసం.. వైమానిక దాడిలో 27 మంది మృతి

ఏపీలో పోలింగ్ అనంతరం అల్లర్లపై మరిన్ని కేసులు నమోదు చేసేందుకు సిట్ రెడీ అయింది. ఇప్పటికే స్థానిక పోలీసులకు కేసులు నమోదుపై పలు సూచనలు చేసింది. అల్లర్లలో ప్రమేయం ఉన్న రాజకీయ నేతల అరెస్ట్ పై కూడా సిట్ విచారణ చేస్తుంది. ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని, విచారణ ఎక్కడి వరకు వచ్చిందనే విషయాలను ప్రత్యేక దర్యాప్తు టీమ్ తెలుసుకుంటుంది. కేసుల్లో నిందితులుగా ఉన్న రాజకీయ నేతల అరెస్ట్ లపై కూడా స్థానిక పోలీసులకి సిట్ అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.