NTV Telugu Site icon

MLAs Purchase Case : మరోసారి న్యాయవాది శ్రీనివాస్‌కు నోటీసులు

Advocate Srinivas

Advocate Srinivas

మొయినాబాద్‌ ఫాంహౌస్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుత రాజకీయాలను సైతం ఈ కేసు హీటెక్కిస్తోంది. అయితే.. ఈ కేసులో ఇప్పటికే తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌కు బంధువైన న్యాయవాది శ్రీనివాస్‌ను సిట్‌ విచారించింది. అయితే.. తాజాగా మరోసారి న్యాయవాది శ్రీనివాస్‌కు సిట్‌ నోటీసులు జారీ చేసింది. నందూ, సింహయాజీతో కలిసి ఎక్కడెక్కడ ప్రయాణం చేశారో చెప్పాలని న్యాయవాది శ్రీనివాస్ కు సిట్ నోటీసు జారీ చేసింది సిట్‌. నందూ వద్ద రూ.55లక్షలు అప్పు తీసుకున్నట్లు శ్రీనివాస్ తెలిపారని నోటీసులో పేర్కొన్న సిట్.. నందకుమార్ కు నెలకు రూ.1.10లక్షలు వడ్డీ చెల్లిస్తున్నట్లు శ్రీనివాస్ తెలిపారని, వడ్డీ చెల్లిస్తున్న గూగుల్ పే, ఫోన్ పే వివరాలు సమర్పించాలని సిట్ ఆదేశించింది.
Also Read : Crocodiles and Elephants Attacks: పల్నాడులో మొసళ్ళు.. చిత్తూరులో ఏనుగుల హల్ చల్

ఎక్కడికి వెళ్లినా తనకు నందూనే టికెట్లు బుక్ చేస్తారని శ్రీనివాస్ వెల్లడించినట్లు పేర్కొన్న సిట్.. నందకుమార్ బుక్ చేసిన విమాన టికెట్ల వివరాలు ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. విచారణకు వచ్చేటప్పుడు పలు వివరాలు తీసుకురావాలని సిట్ పేర్కొంది. అయితే.. రేపు విచారణకు హాజరు కావాలని నిన్న శ్రీనివాస్ ను ఆదేశించింది హైకోర్టు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఈనెల 21, 22న సిట్ విచారణకు హాజరయ్యారు శ్రీనివాస్. ఈనెల 21న తన శాంసంగ్ ఫోన్ ను సిట్ అధికారులకు అప్పగించిన శ్రీనివాస్.. జులై వరకు వాడిన మరో ఫోన్ అప్పగించాలని శ్రీనివాస్ కు స్పష్టం చేసింది సిట్‌.
Also Read : Motion sickness Tips : జర్నీల్లో వచ్చే వాంతులను తగ్గించే చిట్కాలు

పాత ఫోన్ పగిలినందున జూన్ 1న కొత్త ఫోన్ కొన్నట్లు సిట్ కు తెలిపిన శ్రీనివాస్.. ఓ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా విమాన టికెట్లు బుక్ చేసినట్లు సిట్ కు తెలిపారు. సిట్ కు అప్పగించిన మొబైల్ ఫోన్లోనే ట్రావెల్ ఏజెన్సీ వివరాలు ఉన్నాయని శ్రీనివాస్‌ తెలిపారు. అయితే.. శ్రీనివాస్, ఆయన భార్య బ్యాంకుల ఖాతాల వివరాలు, పాస్ పోర్టు ఇవ్వాలన్న సిట్ సూచించింది.