NTV Telugu Site icon

SIT Investigation: ఏపీలో అల్లర్లపై సిట్ నివేదిక సిద్ధం.. నేడు ఈసీకి రిపోర్ట్ ఇవ్వనున్న డీజీపీ, సీఎస్

Sit

Sit

SIT conducts investigation in Tirupati & Palnadu districts: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13వ తేదీన జరిగిన ఎన్నికల సమయంలో తలెత్తిన ఘర్షణలపై ఎన్నికల కమిషన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో భాగంగానే రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాతో పాటు సీఎస్ జవహర్ రెడ్డి నోటీసులు ఇచ్చి.. ఏపీలో జరిగిన అల్లర్లపై పూర్తి నివేదికను కోరింది. దీంతో ఏర్పాటైన సిట్ గత రెండు రోజులుగా విచారణ చేసి.. పూర్తి స్థాయిలో ప్రాథమిక రిపోర్ట్ ను రెడీ చేశారు. నిన్నటితో తాడిపత్రి, పల్నాడు జిల్లాలో ఎంక్వైరీ చేసిన అధికారులు నేడు డీజీపీకి నివేదికను ఇవ్వనున్నారు. ఆ రిపోర్ట్ సీఎస్ ద్వారా సీఈఓ, సీఈసీకి అందించనున్నారు.

Read Also: LOK Sabha-Elections Live 2024: 8 రాష్ట్రాల్లో 49 స్థానాలకు జరగనున్న పోలింగ్..

ఇక, అనంతపురం జిల్లా తాడిపత్రిలో సిటి అధికారుల విచారణ ముగిసింది. సుదీర్ఘంగా కేసులకు సంబంధించిన రికార్డులు, వీడియో దృశ్యాలను పరిశీలించారు. స్థానిక పోలీసులకు సిట్ పలు సూచనాలు చేసింది.. పట్టణంలో జరిగిన అలర్లప్తె సిట్ బృందానికి పోటాపోటీగా టీడీపీ- వైసీపీ నేతలు ఫిర్యాదులు చేశారు. గొడవలు జరగడానికి మీరెంటే మీరు కారణమంటూ పరస్పరం కంప్లైంట్స్ చేసేశారు. ఈ నివేదికను ఉన్నతాధికారులకు సిట్ బృందం అందజేయనున్నారు. అలాగే, తాడిపత్రిలోని ప్రధాన రహదారులలో అన్ని వాహనాలను పోలీసులు చెక్ చేస్తున్నారు. కీలక నాయకులు వస్తారన్న ప్రచారంతో అధికారులు అలర్ట్ అయ్యారు.

Read Also: Tillu Cube:టిల్లు గా ఈసారి ఏం ప్లాన్ చేశావ్? ఇంకో హీరోను దింపుత్తున్నావా…

మరోవైపు.. చంద్రగిరి హింసాత్మక ఘటనలపై సిట్ విచారణ మూడో రోజు కొనసాగనుంది. చంద్రగిరిలో జరిగిన దాడులకు సంబంధించిన ఆధారాలను సిట్ అధికారులకు టీడీపీ ఇన్ చార్జ్ పులివర్తి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరపున న్యాయవాదులు, కూచువారిపల్లె గ్రామాస్థులు అందించారు. సేకరించిన, వచ్చిన ఆధారాలను పరిశీలించనున్న సిట్ బృందం.. పరిశీలన తరువాత పూర్తి స్థాయి నివేదికను సిట్ ఐజీకి సిట్ అధికారులు అందించనున్నారు.

Read Also: Top Movies In 2024: ఈ ఏడాది 100 కోట్లు రాబట్టిన సినిమాలు ఇవే..

అలాగే, నేడు పల్నాడు జిల్లాలోని క్రోసూరు, అచ్చంపేట మండలాల్లో సిట్ బృందం పర్యటించనుంది. పోలింగ్ సందర్భంగా జరిగిన ఘర్షణపై విచారణ చేయనుంది. ఇప్పటికే శాఖాపరమైన దర్యాప్తు పూర్తి చేసిన సిట్.. క్షేత్రస్థాయిలో మరికొన్ని గ్రామాలు పర్యటించాల్సి ఉన్న నేపథ్యంలో.. నేడు పెదకూరపాడు నియోజకవర్గంలో పర్యటించబోతుంది. దొడ్లేరు, వేల్పూరు గ్రామాల్లో సిట్ అధికారులు పర్యటించే అవకాశం ఉంది.