Liquor Scam: లిక్కర్ స్కాం కేసులో సిట్ (SIT) రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 200 పేజీలతో కూడిన రెండో చార్జ్ షీట్ ను ఏసీబీ కోర్టులో వేసింది సిట్. ఇక ఈ చార్జ్ షీట్ లో సిట్ పేర్కొన్న కీలక అంశాల విషయానికి వస్తే..
ఈ లిక్కర్ స్కాం కేసులో మొత్తం ముగ్గురు నిందితుల పాత్రపై కీలక ఆధారాలను సిట్ పొందుపరిచింది. రిటైర్డ్ ఐఎఎస్ ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప పాత్ర ఛార్జ్ షీట్ లో సిట్ వివరించింది. అలాగే లిక్కర్ పాలసీ మార్పు, సిండికేట్ సమావేశాలు, ముడుపుల వ్యవహారంలో వీరి ఆదేశాలు, అలాగే పాత్ర ఉందని నిర్దారణకు వచ్చింది. లిక్కర్ పాలసీ మార్పు, అమలు, కమీషన్లు, తదితర వ్యవహారాలను ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పరివేక్షించినట్టు గుర్తించారు అధికారులు. అలాగే లిక్కర్ ముడుపులు ఎలా సేకరించాలి, ఎక్కడ దాచాలి, బ్లాక్ ను వైట్ గా ఎలా మార్చాలి..? అనే అంశంలపై బాలాజీ గోవిందప్ప సూచనలు చేసినట్టు సిట్ గుర్తించింది.
అలాగే ఈ ముగ్గురు కాల్ డేటా రికార్డు, గూగుల్ టేక్ అవుట్, ఇతర ల్యాప్ టాప్ లోని వివరాలను చార్జ్ షీట్ లో సిట్ అధికారులు పొందుపరిచారు. ఇంకా లిక్కర్ పాలసీ లో రూపకల్పనలో ధనుంజయ్ రెడ్డి అడుగడుగునా జోక్యం చేసుకున్నారని సిట్ పేర్కొంది. ముడుపులు ఎవరి వద్ద నుంచి ఎంత తీసుకున్నారు..? ఎవరెవరికి ఎంత చేరిందనే అంశంపై కూడా వివరాలను సిట్ పేర్కొంది. డిస్టలరీల యజమానులతో పాటు విజయ్ సాయిరెడ్డి, మిథున్ రెడ్డిలతో ఈ ముగ్గురు ఫోన్ లో మాట్లాడిన వివరాలను కూడా సేకరించినట్టు సిట్ అధికారులు పేర్కొన్నారు. అలాగే లిక్కర్ సిండికేట్ సమావేశాలకు పలుమార్లు ధనుంజయ్ రెడ్డి హజరు అయినట్టు గూగుల్ టేక్ అవుట్ సాక్ష్యాలను సిట్ అటాచ్ చేసింది.
ఇక ఈ ముడుపుల మొత్తాన్ని బినామీల పేర్లతో పెట్టుబడులు పెట్టారని కూడా సాక్ష్యాలను సిట్ అధికారులు సేకరించారు. బాలాజీ గోవిందప్ప కొంతమంది డిస్టలరీల యజమానులతో నేరుగా కాంటాక్ట్ లో ఉన్నారని సిట్ కు ఆధారాలు తేల్చారు. ఆయన ల్యాప్ టాప్, మొబైల్ నుంచి కొంత డేటాను సిట్ అధికారులు సేకరించారు. జులై 19వ తేదీన 305 పేజీలతో సిట్ అధికారులు తొలి చార్జ్ షీట్ దాఖలు చేసిన విష్యం తెలిసిందే.