NTV Telugu Site icon

Medak Crime: వీడిన మిస్టరీ.. భర్తను, తన చెల్లిని హత్య చేసేందుకు సుపారి ఇచ్చిన అక్క

Medak Crime

Medak Crime

Medak Crime: మెదక్‌ జిల్లాలో జంట హత్యల కేసు మిస్టరీ వీడింది. కట్టుకున్న భర్తను, తన చెల్లి హత్య చేసేందుకు అక్క సుపారీ ఇచ్చి హత్య చేయించిన దారుణ ఘటన మెదక్‌ జిల్లాలోని హత్నూర మండలం షేర్‌ఖాన్‌పల్లిలో చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తని, తన చెల్లిని హత్య చేసేందుకు 50 వేల రూపాయలతో అక్క సుపారి కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో జూన్ 17న హత్నూర (మం) షేర్ ఖాన్ పల్లిలో జంట హత్యలు జరిగాయి. లక్ష్మణ్, బాషా మృతదేహాలను పోలీసులు అటవీప్రాంతంలో గుర్తించారు.

Also Read: HMDA: రికార్డు స్థాయి ధర పలికిన కోకాపేట భూములు.. ఎకరం రూ.72 కోట్లు

భర్తతో గొడవపడి భార్య బేబీ పుట్టింటికి వెళ్లడంతో బేబీకి వరుసకు చెల్లెలు అయిన భాషని లక్ష్మణ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి కోపంతో ఎలాగైనా భర్తని, చెల్లిని చంపాలని బేబీ ప్లాన్ చేసింది. తన సోదరుడు వినోద్‌తో హత్యకు ప్లాన్ వేసి 50 వేలకు సుపారి ఇచ్చి 5 వేలు అడ్వాన్స్ ఇచ్చింది బేబీ. ఇద్దరికి మద్యం తాగించి షేర్ ఖాన్ పల్లి అటవీ ప్రాంతంలో బండ రాళ్లతో కొట్టి లక్ష్మణ్‌ని, కత్తితో పొడిచి భాషను వినోద్ హత్య చేశాడు. కేసు దర్యాప్తులో భాగంగా ఈ విషయం బయటకు రావడంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బేబీ, వినోద్‌లను అదుపులోకి తీసుకున్నారు.

 

 

Show comments