NTV Telugu Site icon

Singireddy Niranjan Reddy : అధికారం కోసం మేము అడ్డగోలుగా వాగ్దానాలు చేయం

Niranjan Reddy

Niranjan Reddy

తెలంగాణలో ఎన్నికల ప్రచారం హీట్‌ పెంచుతోంది. ఆయా పార్టీల నేతలు ప్రజలను తమవైపుకు ఆకర్షించేందుకు జోరుగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నిరంజన్ రెడ్డి నేడు వనపర్తి తెలంగాణ భవన్‌లో మీడియా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ బీఆర్‌ఎస్‌ హయాంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందన్నారు. అధికారం కోసం మేము అడ్డగోలుగా వాగ్దానాలు చేయమని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎన్ని గ్యారెంటీ లు ఇచ్చిన ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదన్నారు నిరంజన్‌ రెడ్డి. మరోసారి తెలంగాణ లో బీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని ఆయన ఉద్ఘాటించారు. కర్ణాటకలో గ్యారంటీల ఫీజులు ఎగిరి పోతున్నాయన్నారు. ఎవరు సర్వేలు చేసిన బీఆర్‌ఎస్‌దే అధికారం అని చెబుతున్నారన్నారు.

Also Read : JaiShankar: “పదే పదే భారత వ్యవహారాల్లో జోక్యం”.. 41 మంది కెనడా దౌత్యవేత్తల తొలగింపుపై జైశంకర్..

కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టు పనులన్నీ 30, 40 ఏళ్లు దాటినవేనని, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కేవలం మూడున్నర ఏండ్లలో పూర్తి చేసి సాగు నీరు అందజేశామని పేర్కొన్నారు. అత్యంత వేగంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిని సాధించింది. రాష్ట్రంలో ప్రజలకు ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అభివృద్ధిలో దాపరికం లేదు. వ్యవసాయం కోసం నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేసిన ప్రభుత్వం దేశంలో ఒక్క తెలంగాణ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.

Also Read : Nara Lokesh: చంద్రబాబు సాధించ‌బోయే విజ‌యంగా ఈ ద‌స‌రాను సెల‌బ్రేట్ చేసుకుందాం..