Site icon NTV Telugu

BJP President: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా మధ్యప్రదేశ్ మాజీ సీఎం..?

Shivraj Singh

Shivraj Singh

BJP National President: లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అనుకున్న మేర ఫలితాలు రాకపోవడంతో పార్టీని పటిష్ట పరిచేందుకు హైకమాండ్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బీజేపీ జాతీయాధ్యక్షుడిగా కొనసాగుతున్న జేపీ నడ్డాను తప్పించి ఆ స్థానంలో మరో సీనియర్ నేతకు ఛాన్స్ ఇవ్వాలని ప్లాన్ చేస్తుంది. దీంతో జాతీయ అధ్యక్ష రేసులో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రేసులో ఉన్నారు.

Read Also: USA vs PAK: పాక్‌కు షాకిచ్చిన యూఎస్ బౌలర్ మనోడే.. రాహుల్‌, మయాంక్‌లతో కలిసి ఆడాడు!

కాగా, రాజకీయ జీవితం దాదాపు ముగిసిపోయింది అనుకున్న దశలో మధ్య ప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ కు అత్యంత కీలక బాధ్యత దక్కే దక్కనున్నట్లు సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్థానంలో చౌహాన్‌ను నియమిస్తారనే ప్రచారం గత కొన్ని రోజులుగా జోరుగా సాగుతుంది. ఈ మేరకు తక్షణమే ఢిల్లీకి రావాలంటూ ఆయనకు కమలం పార్టీ కబురు పెట్టింది. ఇప్పటి వరకు శివరాజ్‌ చౌహాన్ రికార్డు స్థాయిలో పదహారున్నరేళ్లు సీఎంగా పని చేశారు. అత్యధిక కాలం సీఎంగా ఉన్న బీజేపీ ముఖ్యమంత్రి కూడా ఈయనే.. గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శివరాజ్‌ సారథ్యంలోనే పార్టీ ఘన విజయం సాధించినప్పటికి.. ఆయనకు సీఎం సీటు దక్కలేదు. దీంతో చౌహాన్ కేబినెట్‌లో మంత్రిగా పని చేసిన మోహన్‌ యాదవ్‌ను బీజేపీ హైకమాండ్ ముఖ్యమంత్రిని చేసింది.

Read Also: Shankar :ఆ కోలీవుడ్ స్టార్ హీరోతో మూవీ చేయనున్న శంకర్..?

ఇక, ఎమ్మెల్యేగానే కొనసాగుతున్న శివరాజ్ సింగ్ చౌహాన్.. ఓ దశలో తీవ్ర అసహనానికి గురైయ్యాడు. చావనైనా చస్తాను కానీ.. ఢిల్లీకి వెళ్లి పదవి ఇమ్మని కోరను అని పేర్కొన్నాడు. అయితే, తాజా లోక్‌సభ ఎన్నికల సందర్భంగానూ మొదట శివరాజ్‌ను ఎంపీగా పోటీకి దించేందుకు విముఖత చూపిన కమలం పార్టీ చివరకు ఆయననే పోటీ దించడంతో 8. 20 లక్షల పైగా భారీ మెజార్టీతో విజయం సాధించారు. కాగా, రిసెంట్ గా శివరాజ్ ను బీజేపీ అధిష్టానం ఢిల్లీకి పిలిపించడంతో జాతీయ అధ్యక్ష పదవి ఆయన్ని వరించబోతోందనే చర్చ జోరుగా నడుస్తోంది. ఈయనతో పాటు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు సైతం హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించబోతున్నట్లు టాక్ కొనసాగుతుంది.

Exit mobile version