Singer Mangli: “మైక్రో ఫైనాన్స్ అనే పదమే నాకు తెలియదు”.. స్కామ్ ఆరోపణలపై సింగర్ మంగ్లీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Singer Mangli: గత కొన్ని రోజులుగా సింగర్ మంగ్లీ, ఆమె తమ్ముడిపై అనేక ఆరోపణలు వచ్చాయి. మైక్రోఫైనాన్స్ స్కామ్ అంశానికి సంబంధించి న్యాయవాది సుబ్బారావు కంప్లైంట్ ఇచ్చాడు. మంగ్లీ సైతం ఆ న్యాయవాదిపై ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై ప్రస్తుతం రచ్చ కొనసాగుతోంది. ఈ వివాదానికి తనకు ఎలాంటి సంబంధం లేదని గతంలో మీడియాతో మంగ్లీ విన్నవించుకుంది. బుధవారం మరోసారి సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేసింది. మైక్రో ఫైనాన్స్ అనే పదమే తనకు తెలియదని చెప్పింది. “ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. రామావత్ మధు ను మా కమ్యూనిటీ ప్రోగ్రామ్ లో కలిసిన మాట వాస్తవమే. అంతమాత్రాన ఆయన చేసిన తప్పులకు నేను బాధ్యురాలిని కాదు. మా తమ్ముడు శివకు ఈ వివాదం తో సంబంధం లేదు. చీటింగ్ విషయంలో నా పేరు వాడుతున్నాడని తెలిసి నేనే స్వయంగా మధుపై ఫిర్యాదు చేశా. మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో నేను బాధితురాలినే. డబ్బులు ఇచ్చి బాధితులు మోసపోతే.. అకారణంగా బురద చల్లి నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ వివాదంలో నా పేరు రావడంతో నేను మా కుటుంబ సభ్యులు మానసిక క్షోభకు గురవుతున్నాం. రామావత్ మధుతో నాకు ఎలాంటి బంధుత్వం లేదు. చట్టం ఎవరికి మినహాయింపు ఇవ్వదు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు. బాధితులకు న్యాయం జరగాలి. దర్యాప్తు అధికారులకు సహకరిస్తా.” అని ఆ వీడియోలో పేర్కొంది.
READ MORE: Ranbir Kapoor :‘టైమ్ 100’ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ నటుడు!
Also Read
ఇదిలా ఉండగా.. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని న్యాయవాది సుబ్బారావుపై సింగర్ మంగ్లీ ఇటీవల ఫిర్యాదు చేసింది. తన తరఫు న్యాయవాదితో కలిసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. లిఖిత పూర్వక ఫిర్యాదును పోలీసులకు అందజేసింది. అనంతరం మీడియాతో మాట్లాడింది. ‘‘న్యాయవాది సుబ్బారావు నాపై దుష్ప్రచారం చేసి, ప్రాచుర్యం పొందాలని చూస్తున్నారు. ఫైనాన్స్ మోసం కేసుతో నాకు సంబంధం లేదు. నాకు చేతినిండా పని ఉంది.. ప్రజలను మోసం చేసే పని చేయను. బాధితుల తరఫున నేను కూడా పోరాడుతా. నాకు డబ్బు ఆశ లేదు.. పాటలే నా ప్రపంచంగా జీవిస్తున్నా. కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. నా మూలాలు మర్చిపోను. నా తమ్ముడిపై కూడా ఆరోపణలు మోపుతున్నారు. డబ్బు కట్టలతో ఉన్న వ్యక్తి నా తమ్ముడు కాదు’’ అని మంగ్లీ వివరించింది. మరోసారి సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చింది.
READ MORE: Nicholas Pooran: దాచడానికి ఏముంది, మేం చెత్తగా ఆడాం.. లక్నో కెప్టెన్ పూరన్!
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!