NTV Telugu Site icon

Singareni: డిసెంబర్‌లో సింగరేణి ఆల్ టైం రికార్డ్‌

Singareni

Singareni

హైదరాబాద్ సింగరేణి భవన్‌లో బుధవారం సింగరేణి సీఎండి శ్రీధర్ సింగరేణి డైరెక్టర్లు, అడ్వైజర్లు, అన్ని ఏరియాల జీఎంలతో డిసెంబర్ నెల ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. సింగరేణి ఆల్ టైం రికార్డుగా డిసెంబర్ ఒక్క నెలలోనే 67.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసిందని ఆయన వెల్లడించారు. గత ఏడాది డిసెంబర్ నెల ఉత్పత్తిపై 19 శాతం వృద్ధి చేసినట్లు తెలుస్తోంది. రోజుకు సగటున 2.18 లక్షల టన్నుల బొగ్గు రవాణాతో మరో ఆల్ టైం రికార్డు సాధించినట్లు అధికారులు తెలిపారు. ఇదే ఒరవడితో వార్షికాంతానికి 34 వేల కోట్ల టర్నోవర్, అత్యధిక లాభాల దిశగా సింగరేణి సాగుతోంది. సింగరేణి చరిత్రలోనే ఈ ఏడాది అత్యధిక బొగ్గు ఉత్పత్తి, రవాణా సాధించనున్నామన్నారు అధికారులు. ఇకపై రోజుకు కనీసం 2 లక్షల 30 వేల టన్నులకు తగ్గకుండా బొగ్గు ఉత్పత్తి, రవాణా జరపాలి నిర్ణయించినట్లు తెలుస్తోంది. అన్ని ఏరియాల జీఎంల సమీక్ష సమావేశంలో సింగరేణి సీఎండి శ్రీధర్ వెల్లడించారు.
Also Read : Team India: టీమిండియాకు గుడ్‌న్యూస్.. బుమ్రా వచ్చేశాడు..!!

ఇదిలా ఉంటే.. గత 2021 డిసెంబర్‌ నెలలో 56.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించగా, ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ 19 శాతం వృద్ధితో 67.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు శ్రీధర్‌ వెల్లడించారు. అలాగే గత డిసెంబర్లో 37.37 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ను తొలగించగా, ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్లో 24.47 శాతం వృద్ధితో 47 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓబీని తొలగించామని తెలిపారు శ్రీధర్‌. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా మిగిలి ఉన్న 80 రోజులు చాలా కీలకమని, రోజుకు కనీసం 2 లక్షల 30 వేల టన్నులకు తగ్గకుండా బొగ్గు ఉత్పత్తి, రవాణా జరపాలని, తద్వారా సింగరేణి ఈ ఆర్థిక సంవత్సరంలో చరిత్రలోనే అత్యధిక బొగ్గు ఉత్పత్తి, రవాణా నమోదు చేయనున్నామని, తద్వారా అత్యధికంగా 34 వేల కోట్లకు పైబడి టర్నోవర్, అత్యధిక లాభాలు ఆర్జించే అవకాశాలు ఉన్నాయని శ్రీధర్‌ తెలిపారు. ప్రస్తుతం మణుగురు, కొత్తగూడెం, రామగుండం రీజియన్, అడ్రియాల ప్రాజెక్టుల నుండి గరిష్ట స్థాయిలో బొగ్గు ఉత్పత్తి రవాణా జరగడం పైన తన సంతోషం వ్యక్తం చేశారు. అన్ని ఏరియాలు ఇదే ఒరవడితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు సీఎండీ శ్రీధర్‌.