Singareni: డిసెంబర్లో సింగరేణి ఆల్ టైం రికార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ సింగరేణి భవన్‌లో బుధవారం సింగరేణి సీఎండి శ్రీధర్ సింగరేణి డైరెక్టర్లు, అడ్వైజర్లు, అన్ని ఏరియాల జీఎంలతో డిసెంబర్ నెల ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. సింగరేణి ఆల్ టైం రికార్డుగా డిసెంబర్ ఒక్క నెలలోనే 67.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసిందని ఆయన వెల్లడించారు. గత ఏడాది డిసెంబర్ నెల ఉత్పత్తిపై 19 శాతం వృద్ధి చేసినట్లు తెలుస్తోంది. రోజుకు సగటున 2.18 లక్షల టన్నుల బొగ్గు రవాణాతో మరో ఆల్ టైం రికార్డు సాధించినట్లు అధికారులు తెలిపారు. ఇదే ఒరవడితో వార్షికాంతానికి 34 వేల కోట్ల టర్నోవర్, అత్యధిక లాభాల దిశగా సింగరేణి సాగుతోంది. సింగరేణి చరిత్రలోనే ఈ ఏడాది అత్యధిక బొగ్గు ఉత్పత్తి, రవాణా సాధించనున్నామన్నారు అధికారులు. ఇకపై రోజుకు కనీసం 2 లక్షల 30 వేల టన్నులకు తగ్గకుండా బొగ్గు ఉత్పత్తి, రవాణా జరపాలి నిర్ణయించినట్లు తెలుస్తోంది. అన్ని ఏరియాల జీఎంల సమీక్ష సమావేశంలో సింగరేణి సీఎండి శ్రీధర్ వెల్లడించారు.
Also Read : Team India: టీమిండియాకు గుడ్‌న్యూస్.. బుమ్రా వచ్చేశాడు..!!
ఇదిలా ఉంటే.. గత 2021 డిసెంబర్ నెలలో 56.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించగా, ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 19 శాతం వృద్ధితో 67.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు శ్రీధర్ వెల్లడించారు. అలాగే గత డిసెంబర్లో 37.37 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ను తొలగించగా, ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్లో 24.47 శాతం వృద్ధితో 47 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓబీని తొలగించామని తెలిపారు శ్రీధర్. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా మిగిలి ఉన్న 80 రోజులు చాలా కీలకమని, రోజుకు కనీసం 2 లక్షల 30 వేల టన్నులకు తగ్గకుండా బొగ్గు ఉత్పత్తి, రవాణా జరపాలని, తద్వారా సింగరేణి ఈ ఆర్థిక సంవత్సరంలో చరిత్రలోనే అత్యధిక బొగ్గు ఉత్పత్తి, రవాణా నమోదు చేయనున్నామని, తద్వారా అత్యధికంగా 34 వేల కోట్లకు పైబడి టర్నోవర్, అత్యధిక లాభాలు ఆర్జించే అవకాశాలు ఉన్నాయని శ్రీధర్ తెలిపారు. ప్రస్తుతం మణుగురు, కొత్తగూడెం, రామగుండం రీజియన్, అడ్రియాల ప్రాజెక్టుల నుండి గరిష్ట స్థాయిలో బొగ్గు ఉత్పత్తి రవాణా జరగడం పైన తన సంతోషం వ్యక్తం చేశారు. అన్ని ఏరియాలు ఇదే ఒరవడితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు సీఎండీ శ్రీధర్.
Also Read
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
- Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
తాజావార్తలు
-
Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
-
Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
-
Sumalatha: ఫిలిం ఫెడరేషన్ అధ్యకుడు అనిల్ ను సస్పెండ్ చేయాలి
-
IND vs SL Semi Final: భారత్, శ్రీలంక సెమీఫైనల్‌కు వర్షం ముప్పు?.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ బెర్త్ ఎవరిది?
-
Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!