NTV Telugu Site icon

Singareni Elections: సింగరేణిలో మరి కాసేపట్లో ముగియనున్న ఎన్నికల ప్రచారం..

Singareni

Singareni

సింగరేణిలో ఎన్నికల ప్రచారం మరి కాసేపట్లో ముగియనుంది. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘానికి జరగనున్న ఎన్నికల్లో 13 పార్టీలు పోటీ పడుతున్నప్పటికీ ప్రధానంగా కాంగ్రెస్, సీపీఐ, టీఆర్ఎస్ పార్టీల పోటీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా కాంగ్రెస్- సీపీఐ పార్టీలు గత ఎన్నికలలో కలిసి పోటీ చేసినప్పటికీ ఇప్పుడు సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో మాత్రం ఇద్దరూ వేర్వేరుగా పోటీ చేస్తున్నారు. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీల మధ్య పోరు మాత్రం హోరాహోరీగా కొనసాగుతుంది.

Read Also: Devil: సలార్ సత్తా చూపాడు.. ఇక డెవిల్ కోసం వెయిటింగ్!

ఈ నేపథ్యంలో నిన్నటి ( ఆదివారం) వరకు రెండు సార్లు గెలుపొందిన టీజీబీకేఎస్ మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తుంది. అయితే తాజాగా ఐఎన్టీయూసీ తరఫున మంత్రులందరూ రంగ ప్రవేశం చేయటంతో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీల మధ్య పోరు కనబడుతుంది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెంలోనీ సింగరేణి ప్రధాన కార్యాలయం దగ్గర ఈ ఉదయం నుంచి ఐఎన్టీయూసీ, ఏఐయూసీల మధ్య వివాదం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సింగరేణి ప్రధాన కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదే విధంగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వారిద్దరూ కూడా సింగరేణి ప్రధాన కార్యాలయంలోనే తమ ఎన్నికల ప్రచారాన్ని చేస్తుండడంతో ఉద్రిక్తమైన వాతావరణ పరిస్థితి నెలకొంది. ఇక, ఇవాళ సాయంత్రం 5 గంటలకు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఎన్నికల రూల్స్ ప్రతి ఒక్కరు పాటించాలని సింగరేణి డైరెక్టర్ పా బలరాం నాయక్ తెలిపారు. ఈ ఎన్నికల్లో మొత్తం 11 ఏరియాల్లో 39, 809 ఓట్లు ఉన్నాయి.