సింగరేణిలో ఎన్నికల ప్రచారం మరి కాసేపట్లో ముగియనుంది. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘానికి జరగనున్న ఎన్నికల్లో 13 పార్టీలు పోటీ పడుతున్నప్పటికీ ప్రధానంగా కాంగ్రెస్, సీపీఐ, టీఆర్ఎస్ పార్టీల పోటీ కొనసాగుతుంది.
నేడు తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియకు చివరి రోజు. దీంతో ఈ నెల 30వ తేదీన ఎన్నికల పోలింగ్ బరిలో నిలిచేదెవరో ఇవాళ ఖరారు కానుంది. ఇక, నామపత్రాల పరిశీలన అనంతరం 2898 మంది అభ్యర్థులు మిగిలినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.