Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Simhachalam Chandanotsavam Nijaroopa Darshanam Arrangements

Simhachalam: రేపే సింహాచల చందనోత్సవం.. అప్పన్న నిజరూప దర్శనం.!

Published Date :April 19, 2026 , 6:21 pm
By Gogikar Sai Krishna
  • నిజరూప దర్శనం ప్రత్యేకత
  • భక్తుల భారీ రద్దీ
  • ఎండల మధ్య సౌకర్యాలు
  • ఏఐతో భద్రత ఏర్పాట్లు
Simhachalam: రేపే సింహాచల చందనోత్సవం.. అప్పన్న నిజరూప దర్శనం.!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఉత్తరాంధ్ర ఇలవేల్పు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి అత్యంత వేడుకైన ‘చందనోత్సవం’ కోసం క్షేత్రం సర్వం సిద్ధమైంది. ఏటా వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ) పర్వదినాన మాత్రమే స్వామి వారు చందన పూత లేకుండా తన నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించేందుకు రెండు లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్న అధికారులు, అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పవిత్ర కార్యక్రమంలో భాగంగా తొలుత ఆలయ వంశపారంపర్య ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి అనిత పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం, రేపు తెల్లవారుజామున 3:30 గంటల నుండి సామాన్య భక్తులకు నిజరూప దర్శనం ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ దర్శన భాగ్యం కలుగుతుందని, ఆ తర్వాత తిరిగి స్వామి వారికి 125 కిలోల కొత్త చందనంతో పూత వేస్తామని ఆలయ కమిటీ తెలిపింది.

Mercedes Buried: అదృష్టం కోసం ‘8888’ నంబర్ ప్లేట్.. మృతదేహంతో పాటు రూ.1.5 కోట్ల బెంజ్ కారును పాతిపెట్టిన ఫ్యామిలీ!

ఎండల తీవ్రత దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) , దేవస్థానం అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. సుమారు 200 పాయింట్లలో 20 లక్షల వాటర్ బాటిళ్లను అందుబాటులో ఉంచడంతో పాటు, మజ్జిగ, బిస్కెట్లు , చిన్న పిల్లలకు పాలు పంపిణీ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భద్రతా పరంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 2,800 మంది పోలీసులతో పహారా ఏర్పాటు చేయడమే కాకుండా, ఈసారి రద్దీని పర్యవేక్షించేందుకు తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను వాడుతున్నారు. వి.ఐ.పి దర్శనాల కోసం రూ.1500, రూ.1000, రూ.300 టికెట్లతో ప్రత్యేక క్యూ లైన్లు సిద్ధం చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి , ఎండ నుండి రక్షణ కల్పించడానికి పటిష్టమైన షెడ్లు, బారికేడ్లు నిర్మించారు. ముగ్గురు మంత్రుల కమిటీ , జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఈ మహా ఉత్సవాన్ని దిగ్విజయంగా నిర్వహించేందుకు యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోంది.

Big Basket : బిగ్ బాస్కెట్ కస్టమర్లకు షాక్.. కుళ్ళిన మాంసం, ఎక్స్‌పైరీ డేట్ వస్తువుల సరఫరా..!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Akshaya Tritiya darshan timings
  • Andhra Pradesh temple festival
  • Andhra Pradesh temples
  • chandanotsavam
  • Nijaroopa Darshanam

తాజావార్తలు

  • Simhachalam: రేపే సింహాచల చందనోత్సవం.. అప్పన్న నిజరూప దర్శనం.!

  • Xiaomi: తక్కువ బిల్లు, ఎక్కువ కంఫర్ట్.. మిజియా సూపర్ ఎనర్జీ సేవింగ్ 1HP ఏసీ విడుదల

  • Health Tips: స్నానం ఎప్పుడు చేస్తే మంచిది.. ఉదయం లేదా సాయంత్రం..?

  • Jammu Kashmir: శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఇద్దరు అమెరికా పౌరుల అరెస్ట్..

  • Big Basket : బిగ్ బాస్కెట్ కస్టమర్లకు షాక్.. కుళ్ళిన మాంసం, ఎక్స్‌పైరీ డేట్ వస్తువుల సరఫరా..!

ట్రెండింగ్‌

  • Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions