Site icon NTV Telugu

IND vs ZIM: టీమిండియాకు సికందర్ రజా మాస్ వార్నింగ్.. “మేము వచ్చింది కేవలం ఆడటానికి కాదు.. గెలవడానికి!”

Ind Vs Zim

Ind Vs Zim

IND vs ZIM: టీ20 ప్రపంచకప్‌లో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. సూపర్-8 దశలో దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓడిపోయిన టీమిండియా ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిలో ఉంది. భారత్ సెమీఫైనల్‌కు వెళ్లాలంటే తదుపరి మ్యాచులు కచ్చితంగా గెలవాల్సిందే. ఈ తరుణంలో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

READ ALSO: వైభవ్ సూర్యవంశీకి Tata Motors స్పెషల్ గిఫ్ట్.. Tata Curvv SUV కారు బహుకరణ..!

భారత్‌కు రజా ఇచ్చిన మెసేజ్ ఏంటి..
చాలా ఏళ్లుగా జింబాబ్వే భారత్‌లో టీ20 మ్యాచ్‌లు ఆడలేదు. అయితే, దీన్ని ఒక సాకుగా తాము చూపించబోమని సికందర్ రజా స్పష్టం చేశారు. “పరిస్థితులు ఎలా ఉన్నా, పిచ్ చిన్నదైనా పెద్దదైనా.. రెండు జట్లకు ఒకేలా ఉంటుంది. భారత్ విసిరే సవాలును స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం” అని ఆయన గంభీరంగా ప్రకటించారు. ఒకప్పుడు బలహీనమైన జట్టుగా భావించిన జింబాబ్వే, ఈ ప్రపంచకప్‌లో అద్భుతాలు చేస్తోంది. గ్రూప్ దశలో శ్రీలంక, ఆస్ట్రేలియా వంటి దిగ్గజ జట్లను ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు సూపర్-8లో భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ వంటి బలమైన జట్లతో తలపడాల్సి ఉన్నా.. ఆ జట్టు ఆత్మవిశ్వాసం ఏమాత్రం తగ్గలేదు.

సెమీఫైనల్ రేసుపై రజా ఏమన్నారంటే..
జింబాబ్వే సెమీఫైనల్‌కు చేరుకుంటుందని ఎవరూ ఊహించలేదని రజా నవ్వుతూ అన్నారు. “మమ్మల్ని ఎవరూ టాప్-4లో ఉంటారని అనుకోలేదు. కానీ ఆ సవాలే మాలో కసిని పెంచుతోంది. మేము కేవలం టోర్నీలో పాల్గొనడానికి రాలేదు, పూర్తి శక్తితో పోటీ పడి గెలవడానికి వచ్చాం” అని టీమ్ ఇండియాకు పరోక్షంగా హెచ్చరిక జారీ చేశారు. ఒకవేళ భారత్ గనుక జింబాబ్వేను తక్కువ అంచనా వేస్తే.. సెమీఫైనల్ ఆశలు గల్లంతయ్యే ప్రమాదం ఉందని క్రీడావిశ్లేషకులు చెబుతున్నారు.

READ ALSO: Healthy Breakfast Recipes: డైట్ చేసేవారికి బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్.. చుక్క నూనె లేకుండా ఆవిరి కుడుమును ఇలా సింపుల్‌గా చేసుకోండి!

Exit mobile version