IND vs ZIM: టీమిండియాకు సికందర్ రజా మాస్ వార్నింగ్.. “మేము వచ్చింది కేవలం ఆడటానికి కాదు.. గెలవడానికి!”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs ZIM: టీ20 ప్రపంచకప్‌లో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. సూపర్-8 దశలో దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓడిపోయిన టీమిండియా ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిలో ఉంది. భారత్ సెమీఫైనల్‌కు వెళ్లాలంటే తదుపరి మ్యాచులు కచ్చితంగా గెలవాల్సిందే. ఈ తరుణంలో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
READ ALSO: వైభవ్ సూర్యవంశీకి Tata Motors స్పెషల్ గిఫ్ట్.. Tata Curvv SUV కారు బహుకరణ..!
Also Read
- 80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
- Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే "మసాలా గుత్తివంకాయ" చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Mahindra Thar 2026: ఆఫ్‌రోడ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త లుక్‌తో మళ్లీ రాబోతున్న మహింద్రా థార్..!
భారత్‌కు రజా ఇచ్చిన మెసేజ్ ఏంటి..
చాలా ఏళ్లుగా జింబాబ్వే భారత్‌లో టీ20 మ్యాచ్‌లు ఆడలేదు. అయితే, దీన్ని ఒక సాకుగా తాము చూపించబోమని సికందర్ రజా స్పష్టం చేశారు. “పరిస్థితులు ఎలా ఉన్నా, పిచ్ చిన్నదైనా పెద్దదైనా.. రెండు జట్లకు ఒకేలా ఉంటుంది. భారత్ విసిరే సవాలును స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం” అని ఆయన గంభీరంగా ప్రకటించారు. ఒకప్పుడు బలహీనమైన జట్టుగా భావించిన జింబాబ్వే, ఈ ప్రపంచకప్‌లో అద్భుతాలు చేస్తోంది. గ్రూప్ దశలో శ్రీలంక, ఆస్ట్రేలియా వంటి దిగ్గజ జట్లను ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు సూపర్-8లో భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ వంటి బలమైన జట్లతో తలపడాల్సి ఉన్నా.. ఆ జట్టు ఆత్మవిశ్వాసం ఏమాత్రం తగ్గలేదు.
సెమీఫైనల్ రేసుపై రజా ఏమన్నారంటే..
జింబాబ్వే సెమీఫైనల్‌కు చేరుకుంటుందని ఎవరూ ఊహించలేదని రజా నవ్వుతూ అన్నారు. “మమ్మల్ని ఎవరూ టాప్-4లో ఉంటారని అనుకోలేదు. కానీ ఆ సవాలే మాలో కసిని పెంచుతోంది. మేము కేవలం టోర్నీలో పాల్గొనడానికి రాలేదు, పూర్తి శక్తితో పోటీ పడి గెలవడానికి వచ్చాం” అని టీమ్ ఇండియాకు పరోక్షంగా హెచ్చరిక జారీ చేశారు. ఒకవేళ భారత్ గనుక జింబాబ్వేను తక్కువ అంచనా వేస్తే.. సెమీఫైనల్ ఆశలు గల్లంతయ్యే ప్రమాదం ఉందని క్రీడావిశ్లేషకులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
-
Mahindra Thar 2026: ఆఫ్‌రోడ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త లుక్‌తో మళ్లీ రాబోతున్న మహింద్రా థార్..!
-
Movie Interval: సినిమా మధ్యలో ‘ఇంటర్వెల్’ ఎందుకు వస్తుందో తెలుసా?.. పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ కోసం కాదు.. అసలు కారణం ఏంటంటే?
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!