NTV Telugu Site icon

SIIMA Awards 2023: సైమా వేడుకలకు ముహూర్తం ఫిక్స్.. హోస్ట్‌గా టాలీవుడ్ హీరో!

Rana, Mrunal Thakur

Rana, Mrunal Thakur

Rana Daggubati and Mrunal Thakur Will Host for SIIMA Awards 2023: భారతదేశంలోని ప్రసిద్ధ అవార్డు షోలలో ఒకటైన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా)కు ముహూర్తం ఖరారు అయింది. ఈ ఏడాది సెప్టెంబర్ 15, 16 తేదీలలో సైమా వేడుకలు నిర్వహించనున్నట్లు ఛైర్‌పర్సన్‌ బృందా ప్రసాద్‌ తెలిపారు. ఈ అవార్డులకు దుబాయ్‌ వేదిక కానుంది. సైమా వేడుకలకు స్పాన్సర్​గా ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ‘నెక్సా’ వ్యవహరించనుందని బృందా ప్రసాద్‌ వెల్లడించారు.

టాలీవుడ్ నుంచి హల్క్ స్టార్ రానా దగ్గుబాటి సైమా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు. సైమా చైర్‌పర్సన్ బృందా ప్రసాద్‌తో కలసి రానా మరియు మృణాల్ సందడి చేశారు. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా రానా వ్యవహరించనున్నారు. మరోక హోస్ట్‌గా మృణాల్ వ్యవహరించే అవకాశం ఉంది. ఇదే నిజమైతే సైమా స్టేజ్ గ్లామర్‌తో వెలిగిపోవడం పక్కా.

సైమా అవార్డు కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన నటీ-నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఇది ప్రారంభమైంది. ఇప్పటికే 11 ఏళ్లు సైమా అవార్డు పురస్కారాల వేడుకలు విజయవంతంగా జరిగాయి. 2023లో జరిగే వేడుకలను కూడా ఘనంగా నిర్వహించేందుకు సైమా ఛైర్‌పర్సన్‌ బృందా ప్రసాద్‌ ఇప్పటికే ప్రణాళికలు వేసుకున్నారు.

Also Read: IND vs WI: భారత్‌తో టెస్ట్ సిరీస్‌కు వెస్టిండీస్‌ జట్టు ప్రకటన.. బాహుబలి రీఎంట్రీ!

Also Read: No Leave in 74 Years: సూపర్ వుమెన్.. ఒక్కరోజు కూడా లీవ్ పెట్టకుండా 74 ఏళ్ల పాటు డ్యూటీ!

 

Show comments