NTV Telugu Site icon

RBI: ఆర్బీఐ సంపాదనలో గణనీయమైన పెరుగుదల..పాకిస్తాన్ జీడీపీ కంటే 2.5 రెట్లు ఎక్కువ

Rbi

Rbi

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాలెన్స్ షీట్లో గణనీయమైన పెరుగుదల చోటుచేసుకుంది. రిజర్వ్ బ్యాంక్ వార్షిక ప్రాతిపదికన మంచి ఆదాయాన్ని ఆర్జించింది. సెంట్రల్ బ్యాంక్ వార్షిక నివేదిక ప్రకారం.. పాకిస్తాన్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కంటే ఆర్‌బీఐ డబ్బు 2.5 రెట్లు ఎక్కువగా ఉంది. మార్చి 31, 2024 నాటికి RBI బ్యాలెన్స్ షీట్ 11 శాతం పెరిగి రూ.70.48 లక్షల కోట్లు(సుమారు $844.76 బిలియన్లు)కు చేరుకుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ప్రకారం.. పాకిస్తాన్ జీడీపీ $338.24 బిలియన్లుగా అంచనా వేయబడింది.

READ MORE: NEET Result 2024: ముదిరిన నీట్ ఫలితాల వివాదం.. ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఫెయిల్.. నీట్ లో 705 మార్కులు

అంతకుముందు ఆర్థిక సంవత్సరం (ఎఫ్‌వై23)లో ఆర్‌బీఐ బ్యాలెన్స్ షీట్ రూ.63.44 లక్షల కోట్లుగా ఉంది. కరోనా తర్వాత పరిస్థితులు తలకిందులయ్యాయి. ఈ మహమ్మారి తర్వాత ఆర్థిక పరిస్థితి పుంజుకుందని ఆర్బీఐ తెలిపింది. మార్చి 2024 చివరి నాటికి, ఇది భారతదేశ GDPలో 24.1%గా మారింది. ఇది మార్చి 2023 చివరి నాటికి 23.5%గా ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ ఖర్చు 56.30% తగ్గిందని నివేదిక పేర్కొంది. ఆర్‌బీఐ మిగులు కూడా వార్షిక ప్రాతిపదికన పెరిగింది. 141.23% వృద్ధి చెంది రూ.2.11 లక్షల కోట్లుగా మారింది. ఇటీవల ఈ మిగులు ప్రభుత్వానికి డివిడెండ్‌గా బదిలీ చేయబడింది. దేశ ఆర్థిక వ్యవస్థ ఈ వేగంతో వృద్ధి చెందుతుందని 2024 ఆర్థిక సంవత్సరంలో అత్యవసర నిధిగా రూ.42,820 కోట్లు కేటాయించింది. దేశ ఆర్థిక వ్యవస్థపై ఆర్‌బీఐ ఆశాజనకంగానే ఉంది. స్థూల ఆర్థిక మూలాధారాల నిరంతర బలం కారణంగా, మంచి ఆర్థిక వృద్ధి ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. అయితే, ఆహార ద్రవ్యోల్బణం అంచనా చుట్టూనే ఉంది. ఆర్‌బిఐ 2025 ఆర్థిక సంవత్సరానికి 7% వాస్తవ జీడీపీ వృద్ధిని అంచనా వేసిందని తెలిసిందే.