RBI: ఆర్బీఐ సంపాదనలో గణనీయమైన పెరుగుదల..పాకిస్తాన్ జీడీపీ కంటే 2.5 రెట్లు ఎక్కువ
- పాకిస్తాన్ జీడీపీ $338.24 బిలియన్లు.. $844.76 బిలియన్లకు చేరిన ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్
- భారత్ జీడీపీలో 24.1%గా మారిన రిజర్వ్ బ్యాంకు ఆదాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాలెన్స్ షీట్లో గణనీయమైన పెరుగుదల చోటుచేసుకుంది. రిజర్వ్ బ్యాంక్ వార్షిక ప్రాతిపదికన మంచి ఆదాయాన్ని ఆర్జించింది. సెంట్రల్ బ్యాంక్ వార్షిక నివేదిక ప్రకారం.. పాకిస్తాన్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కంటే ఆర్బీఐ డబ్బు 2.5 రెట్లు ఎక్కువగా ఉంది. మార్చి 31, 2024 నాటికి RBI బ్యాలెన్స్ షీట్ 11 శాతం పెరిగి రూ.70.48 లక్షల కోట్లు(సుమారు $844.76 బిలియన్లు)కు చేరుకుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ప్రకారం.. పాకిస్తాన్ జీడీపీ $338.24 బిలియన్లుగా అంచనా వేయబడింది.
READ MORE: NEET Result 2024: ముదిరిన నీట్ ఫలితాల వివాదం.. ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఫెయిల్.. నీట్ లో 705 మార్కులు
Also Read
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
- India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
- PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
అంతకుముందు ఆర్థిక సంవత్సరం (ఎఫ్వై23)లో ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ రూ.63.44 లక్షల కోట్లుగా ఉంది. కరోనా తర్వాత పరిస్థితులు తలకిందులయ్యాయి. ఈ మహమ్మారి తర్వాత ఆర్థిక పరిస్థితి పుంజుకుందని ఆర్బీఐ తెలిపింది. మార్చి 2024 చివరి నాటికి, ఇది భారతదేశ GDPలో 24.1%గా మారింది. ఇది మార్చి 2023 చివరి నాటికి 23.5%గా ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ ఖర్చు 56.30% తగ్గిందని నివేదిక పేర్కొంది. ఆర్బీఐ మిగులు కూడా వార్షిక ప్రాతిపదికన పెరిగింది. 141.23% వృద్ధి చెంది రూ.2.11 లక్షల కోట్లుగా మారింది. ఇటీవల ఈ మిగులు ప్రభుత్వానికి డివిడెండ్‌గా బదిలీ చేయబడింది. దేశ ఆర్థిక వ్యవస్థ ఈ వేగంతో వృద్ధి చెందుతుందని 2024 ఆర్థిక సంవత్సరంలో అత్యవసర నిధిగా రూ.42,820 కోట్లు కేటాయించింది. దేశ ఆర్థిక వ్యవస్థపై ఆర్బీఐ ఆశాజనకంగానే ఉంది. స్థూల ఆర్థిక మూలాధారాల నిరంతర బలం కారణంగా, మంచి ఆర్థిక వృద్ధి ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. అయితే, ఆహార ద్రవ్యోల్బణం అంచనా చుట్టూనే ఉంది. ఆర్బిఐ 2025 ఆర్థిక సంవత్సరానికి 7% వాస్తవ జీడీపీ వృద్ధిని అంచనా వేసిందని తెలిసిందే.
తాజావార్తలు
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
-
Theater Plus: ఓటీటీ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు.. రూపాయి కట్టకుండానే 3 మలయాళ బ్లాక్ బస్టర్స్ ఫ్రీ!
-
Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
-
Impure : పెళ్లి కూతురు ‘కన్య’ కాదని పెళ్లి క్యాన్సిల్.. టాలీవుడ్‌ను షేక్ చేసే బోల్డ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘ఇంప్యూర్’!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!