Side Effects Of Green Tea: గ్రీన్ టీ అంటేనే ఆరోగ్యానికి చాలా మంచిది అనే భావన ఉంది. ఏదైనా మోతదు మించి తీసుకుంటే ప్రమాదమే అనే విషయం మనకు తెలిసిందే. అలాగే గ్రీన్ టీ తో ఎన్నో లాభాలు ఉన్నా అధికంగా తీసుకుంటే నష్టాలు కూడా అలానే ఉన్నాయి. గ్రీన్ టీ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ను ఓసారి పరిశీలిస్తే గ్రీన్ టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల అది శరీరంలో ఐరన్ సంగ్రహించే ప్రక్రియను అడ్డుకుంటుంది. ఇది క్రమక్రమంగా ఐరన్ లోపానికి దారి తీస్తుంది. గ్రీన్ టీలో ఉండే కంటెంట్స్ శరీరంలో ఐరన్, క్యాల్షియం వంటి ఇతర పోషకాలను గ్రహించడంలో అడ్డుపడతాయి. కాల్షియాన్ని గ్రహించడం వల్ల ఎముకలు బలహీనంగా మారే అవకాశం ఉంది.
Also Read: Telangana Police: బాసూ మీరు మ..మ..మాస్.. ఫుల్ జోష్ లో డ్యాన్స్ ఇరగ దీసిన పోలీసులు
ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగితే కొంతమందికి కడుపులో మంట వస్తుంది. ఇది క్రమంగా ఎసిడిటీకి దారి తీస్తుంది. గ్రీన్ టీని అధిక మోతాదులో సేవించడం వల్ల నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది. ఇక అంతేకాదు దీనిని అధికంగా తీసుకోవడం వల్ల ఇందులో ఉండే కెఫైన్ మీ మెదడుకు రక్తం సరఫరా కాకుండా అడ్డుపడుతుంది. దీని కారణంగా మోషన్ సిక్‌నెస్ అనే అనారోగ్య సమస్య బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ఇక దీనిలో కెఫిన్ ఎక్కువగా ఉంటుందని తెలిసిందే. దీని కారణంగా తలనొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనిలో ఉండే టానిన్ అనే పదార్థం ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కళ్లు తిరగడం లేదా వాంతులు వంటి లక్షణాలకు దారి తీస్తుంది. అంతేకాదు ఇది కాలేయం మీద కూడా ఎక్కువ ప్రభావం చూపుతుంది. అందుకే గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదని ఎంత తాగితే అంత మంచిది అనే అపోహలో ఉండొద్దు.