Ponnam Prabhakar : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఐఓసీ కార్యాలయంలో హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి పోన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ జిల్లాల అదనపు కలెక్టర్లు, మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. వేసవి కాలం సమీపిస్తున్నందున గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా నిర్వహించి, పేదలకు ప్రాధాన్యత ఇవ్వాలని, వరి కోతలు కొనసాగుతున్న నేపథ్యంలో, కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలన్నారు. రేషన్ కార్డుల పంపిణీ త్వరలో జరగనుంది. ఉగాది నుంచి నల్గొండ జిల్లాలో సన్న బియ్యం పంపిణీ ప్రారంభమవుతుందని, ప్రజలు సమస్యలు ఎదుర్కొన్నా, అధికారులు వాటిని పరిష్కరించకుండా, మంత్రివర్గ దృష్టికి తేవకుండా ఉంటే, ఆందోళనలకు కారణం అధికారులే అవుతారని మంత్రి హెచ్చరించారు.
Ponnam Prabhakar : ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా జరగాలి
- హుస్నాబాద్ అభివృద్ధిపై సమీక్ష – మంత్రి పోన్నం ప్రభాకర్ కీలక సూచనలు
- తాగునీటి, వరి కొనుగోలు, రేషన్ కార్డులపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు
- ప్రజా సమస్యలు పరిష్కరించని అధికారులపై కఠిన చర్యలు – మంత్రి హెచ్చరిక

Ponnam