Siddharth-Allu Arjun: అల్లు అర్జున్‌తో ఏదైనా సమస్యా?.. సిద్ధార్థ్ సమాధానం ఇదే!
- డిసెంబర్ 13న 'మిస్ యూ
- పుష్ప 2ఈవెంట్ కామెంట్స్‌పై సిద్ధార్థ్ క్లారిటీ
- ఎవరితోనూ నాకు సమస్యలు లేవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్ధార్థ్ హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ డ్రామా ‘మిస్ యూ’. ఆషికా రంగనాథ్ హీరోయిన్. తమిళ డైరెక్టర్ రాజశేఖర్ దర్శకత్వం వహించగా.. 7 మైల్స్ పర్ సెకండ్ సంస్థ నిర్మించింది. ఈ సినిమా ఏషియన్ సురేశ్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ సంస్థ ద్వారా డిసెంబర్ 13న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి మిస్ యూ నవంబర్ 29న రిలీజ్ కావాలి కానీ.. ‘పుష్ప 2’ కారణంగా వాయిదా పడింది. మిస్ యూ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న సిద్ధార్థ్.. ఇటీవల పుష్ప 2 ఈవెంట్‌కు వచ్చిన ప్రేక్షకులను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. తాజాగా దానిపై ఆయన క్లారిటీ ఇచ్చారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధార్థ్.. పాట్నాలో జరిగిన పుష్ప 2 ఈవెంట్‌కు లక్షల్లో జనాలు రావడంపై పరోక్షంగా సెటైర్లు వేశారు. ‘సినిమాకు, ప్రమోషన్స్ ఈవెంట్లకు జనాలు రావడానికి సంబంధం లేదు. ఈరోజుల్లో ఏ పనులు జరుగుతున్నా.. చూడడానికి జనాలు భారీగా వస్తున్నారు’ అని సిద్ధార్థ్ అన్నారు. సిద్ధార్థ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది. కొందరు ఆయన్ని విమర్శించారు కూడా. మిస్ యూ ప్రమోషన్లో భాగంగా చెన్నైలో నిర్వహించిన ఓ ప్రెస్మీట్లో ‘మీకు అల్లు అర్జున్‌తో ఏదైనా సమస్య ఉందా?’ అనే ప్రశ్న సిద్ధార్థ్‌కు ఎదురైంది. తనకు ఎవరితోనూ సమస్యలు లేవని, పుష్ప 2 భారీ హిట్ కొట్టినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు.
Also Read
- ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
- Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
Also Read: Gold Rate Today: మూడు రోజులుగా పెరిగిన ధరలకు బ్రేక్.. నేడు తులం బంగారం ఎంతుందంటే?
‘నాకు ఎవరితో సమస్యలు లేవు. పుష్ప 2 భారీ విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది. పుష్ప సూపర్ సక్సెస్ అయింది. అందుకే సీక్వెల్ చూసేందుకు ప్రేక్షకులు భారీగా థియేటర్లకు వెళ్తున్నారు. ప్రమోషన్స్ ఈవెంట్లకు ఎంతమంది వస్తే అంత మంచిది. థియేటర్లకు కూడా అంతకంటే ఎక్కువగా జనాలు రావాలని కోరుకుందాం. ఇండస్ట్రీ ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలి. నటీనటులం అంతా ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం. 100 సినిమాలు రిలీజ్ అయితే.. ఒకటి హిట్ అవుతుంది. ప్రతి ఒక్కరి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలి. మిస్ యూ మీకు నచ్చుతుంది. సినిమా బాగా వచ్చింది’ అని సిద్ధార్థ్ అన్నారు.
తాజావార్తలు
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
-
Mythri Ravi: “రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు”
-
Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
-
Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!