NTV Telugu Site icon

Mahant Raju Das: సిద్దరామయ్య పేరులో రాముడు ఉన్నాడు కానీ అతడి ప్రవర్థన కాలనేమిలా ఉంది..

Pujari

Pujari

కర్ణాటక ముఖ్యమంత్రిపై అయోధ్యలోని హనుమాన్ గరి ఆలయ పూజారి విమర్శలు గుప్పించారు. సిద్ధరామయ్య పేరులోనే రామ్ ఉంది.. కానీ ఆయన ప్రవర్థన కాలనేమిలా ఉందన్నారు. అసురుడు అని అర్థం వచ్చేలా సిద్ధరామయ్యను కాలనేమితో పూజారి మహంత్ రాజు దాస్ పోల్చారు. మరోవైపు కర్ణాటక బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్య ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వాన పత్రికను అందిస్తే.. సిద్ధరామయ్య దాన్ని తిరస్కరించారు.

Read Also: Amitabh Bachchan : ఒకే ఫ్రేమ్ లో సూర్య, అమితాబ్‌, అక్షయ్‌.. వైరల్ అవుతున్న పిక్..

బాబర్‌ను విడిచి పెట్టకపోవడం వల్లే అయోధ్యలోని శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో సిద్ధరామయ్య పాల్గొనబోమని చెప్పాడని కర్ణాటక బీజేపీ ఆరోపించారు. అయితే, కాంగ్రెస్ సీనియర్ లు సిద్ధరామయ్య, మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, అధీర్ రంజన్ చౌదరితో సహా ఇతర నేతలు అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరు కావడం లేదని ప్రకటించారు.

Read Also: Asaduddin Owaisi: మసీదులను రక్షించుకోవాలి.. అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

ఇక, జనవరి 22న జరగనున్న అయోధ్యలోని రామ మందిర శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానాన్ని తిరస్కరించాలన్న కాంగ్రెస్ పార్టీ నిర్ణయంపై తీవ్ర వాగ్వాదం కొనసాగుతుంది. ఇక, ఆఫ్ఘనిస్తాన్‌లోని ‘బాబర్ సమాధి’ దగ్గర రాహుల్ గాంధీ పాత ఫోటోను బీజేపీ పోస్ట్ చేసింది. గాంధీ కుటుంబానికి చెందిన మూడు తరాల వారు ఈ స్థలాన్ని సందర్శించారు.. వారికి హిందువులపై మాత్రమే శత్రుత్వం ఉందని కమలం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా, అయోధ్యలోని రామ మందిర నిర్మాణం అసంపూర్తిగా ఉన్నందు వల్లే ఈ వేడుకకు హాజరుకావడం లేదని కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది. అక్కడ అధికార బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.

Show comments