Site icon NTV Telugu

SI Exams : ప్రశాంతంగా ముగిసిన ఎస్‌ఐ తుది విడత రాత పరీక్షలు

Si Exams

Si Exams

ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన తుది విడత రాత పరీక్షలు ఆదివారంతో ముగిశాయి. పరీక్షలకు 96శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌లో 81 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. శనివారం రెండు పేర్లు, ఆదివారం రెండు పేపర్ల చొప్పున తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ తెలిపింది. శనివారం జరిగిన పరీక్షలకు 81 కేంద్రాలను ఏర్పాటు చేశామని, 62,342 మంది అభ్యర్థులకు గాను 59,534 మంది అభ్యర్థులు హాజరయ్యారని, 95.50 హాజరుశాతం నమోదైందని రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ తెలిపింది.

Also Read : SRH vs PBKS: నిదానంగా ఆడుతున్న హైదరాబాద్‌.. 10 ఓవర్లలో స్కోరు ఇది

ఆదివారం జరిగిన పరీక్షకు 79 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 60,772 మంది అభ్యర్థులకు గాను 58,019 మంది పరీక్ష రాయగా.. 95.47శాతం హాజరు నమోదైందని పేర్కొంది. పరీక్ష సమయంలో అభ్యర్థుల బయోమెట్రిక్‌ వెరిఫికేసన్‌ పూర్తి చేశామని, ప్రిలిమినరీ రాత పరీక్ష సమయంలో తీసుకున్న డిజిటల్‌ వేలిముద్రలు, ఫొటోగ్రాఫ్‌లతో గుర్తింపును నిర్ధాంచిట్లు తెలిపింది. పేపర్లకు సంబంధించిన ప్రిలిమినరీ కీని త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు తెలిపారు

Also Read : Talasani Srinivas : సినీ పరిశ్రమకు ఎప్పుడు సహాయం చేయడానికి ముందుంటాం

Exit mobile version