Shubman Gill: కోహ్లీకి గాయం.. గిల్‌కు ప్లస్ పాయింట్.. విరాట్‌ను వెనక్కి నెట్టేసిన యంగ్ కెప్టెన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shubman Gill: ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు సంచలనం సృష్టించారు. అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత్.. ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టింది. ముఖ్యంగా భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన అద్భుత ఫామ్‌తో ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి ప్రపంచ నంబర్ 2 స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే గిల్ తన సహచర ఆటగాడు, రన్ మెషిన్ విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టడం విశేషంగా మారింది. అఫ్గానిస్తాన్‌పై జరిగిన సిరీస్‌లో గిల్ మొదటి వన్డేలోనే 84 పరుగులతో రాణించడమే కాకుండా, రెండో వన్డేలో 154 పరుగుల వీరోచిత సెంచరీతో అఫ్గాన్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ అమోఘమైన ప్రదర్శనకు గానూ అతనికి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కడంతో పాటు ర్యాంకింగ్స్‌లోనూ దూసుకుపోయాడు.
మరోవైపు, గత కొంతకాలంగా రెండో స్థానంలో స్థిరంగా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయాడు. ఆర్సీబీ, జీటీ మధ్య జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో కుడి కాళ్లకు తగిలిన గాయం (రైట్ హామ్‌స్ట్రింగ్ ఇంజూరీ) కారణంగా కోహ్లీ ఈ అఫ్గాన్ సిరీస్‌కు దూరం కావాల్సి వచ్చింది. కోహ్లీ మ్యాచ్‌లో లేకపోవడం గిల్‌కి కలిసి వచ్చింది. ఇదే అదునుగా గిల్ రేటింగ్‌లో కోహ్లీని అధిగమించాడు. ఇక టీమిండియా సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ 115 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో ఈ సిరీస్‌లో మొత్తం 143 పరుగులు చేశాడు. ఇందులో చివరి రెండు మ్యాచ్‌ల్లో ఆడిన 48, 79 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ సైతం ఉన్నాయి. దీంతో రోహిత్ వన్డే ర్యాంకింగ్స్‌లో తన నాలుగో స్థానాన్ని విజయవంతంగా పదిలం చేసుకున్నాడు.
Also Read
- Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
అయితే, ర్యాంకింగ్స్ రేసులో ఈ అగ్రస్థానాల పోరు రాబోయే రోజుల్లో మరింత ఆసక్తికరంగా మారనుంది. గాయం నుంచి కోలుకున్న విరాట్ కోహ్లీ వచ్చే జూలై నెలలో ఇంగ్లాండ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ద్వారా తిరిగి మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాడు. అక్కడ గిల్‌తో పోటీపడుతూ తన నంబర్ 2 స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలని కోహ్లీ చూస్తుంటే.. అటు రోహిత్ శర్మ సైతం మరింత పైకి ఎగబాకాలని భావిస్తున్నాడు. భారత అభిమానులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ వన్డే సిరీస్ షెడ్యూల్ ప్రకారం.. మొదటి వన్డే జూలై 14 (మంగళవారం) మధ్యాహ్నం 3:30 గంటలకు బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జరగనుంది. ఆ తర్వాత రెండో వన్డే జూలై 16 (గురువారం) సాయంత్రం 5:30 గంటలకు కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్‌లో, అలాగే చివరిదైన మూడో వన్డే జూలై 19 (ఆదివారం) మధ్యాహ్నం 3:30 గంటలకు లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరగనున్నాయి. ఇక, ఈ మ్యాచ్‌లో కోహ్లీ.. గిల్‌ను అధిగమిస్తాడా? వేచిచూద్దాం..
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!