2024 ఐపీఎల్ సీజన్‌లో భాగంగా శనివారం బెంగళూరు లోని ఎం. చినస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ సందర్భంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చిన్నస్వామి స్టేడియంలో జరిగిన శిక్షణలో పాల్గొన్నాడు. ఈ సమయంలోనే భారత మహిళా జట్టు ప్లేయర్ హర్లీన్ డియోల్ గిల్ ను కలిసింది. ఈ సందర్భంగా గుజరాత్ టైటాన్స్ ట్విట్టర్ ఖాతాలో గేల్ కొన్ని బ్యాటింగ్ చిట్కాలను వివరించిన వీడియోను విడుదల చేసింది. ఇప్పుడు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హర్లీన్ డియోల్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో గుజరాత్ జెయింట్స్ తరపున ఆడగా.. అందులో ఆల్‌రౌండర్ గా మంచి ప్రతిభను చూపించింది.
Also Read: T20 World Cup 2024: రోహిత్, ద్రవిడ్ సరైన ప్లేయర్లనే ఎంచుకున్నారు: గంగూలీ
2024 ఐపీఎల్ సీజన్ కు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా శుభ్‌మన్ గిల్ వ్యవహరిస్తున్నాడు. ఈ సీజన్ లో గుజరాత్ మొత్తం 10 మ్యాచ్ లు ఆడి 4 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. దీంతో 8 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. దాంతో ఇప్పుడు జట్టు ప్లేఆఫ్ ఆశలను క్లిష్టతరం చేసుకుంది. ఈరోజు ఆర్‌సీబీతో జరిగే మ్యాచ్ లో గుజరాత్ జట్టు ఓడిపోతే ప్లేఆఫ్ ఆశలు ముగిసిపోతాయి. దీంతో గుజరాత్ గిల్స్ ఆర్‌సీబీ పై గెలిచి ప్లేఆఫ్ కు చేరుకోవాలనే పట్టుదలతో ఉంది.
𝗨𝗻𝗶𝘁𝗲𝗱 𝗯𝘆 🇮🇳@ShubmanGill | @imharleenDeol | #AavaDe | #GTKarshe pic.twitter.com/hmc244FJ3X
— Gujarat Titans (@gujarat_titans) May 3, 2024