Shubman Gill Fine: శుభ్‌మాన్ గిల్‌కు భారీ షాక్.. 12 లక్షల జరిమానా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat Titans Captain Shubman Gill fined RS 12 Lakh: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్‌కు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అతడికి 12 లక్షల రూపాయల జరిమానా విధించింది. మంగళవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్‌ను నమోదుచేసినందుకు గాను గిల్‌కు ఈ ఫైన్ విధించారు. ఈ విషయాన్ని ఐపీఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఐపీఎల్ 2024లో స్లో ఓవర్ రేటు కారణంగా జరిమానా ఎదుర్కొన్న తొలి కెప్టెన్‌గా గిల్ నిలిచాడు.
‘ఐపీఎల్ 2024లో భాగంగా మార్చి 26న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు జరిమానా విధించాం. ఐపీఎల్ నియమావళి మినిమమ్ ఓవర్ రేట్ రూల్స్ ప్రకారం.. గిల్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించాం’ అని ఐపీఎల్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సీజన్లో గుజరాత్ జట్టు చేసిన మొదటి నేరం కావడంతో గిల్‌కి రూ. 12 లక్షల జరిమానాతో బయటపడ్డాడు. రెండోసారి ఇలానే జరిగితే రూ. 24 లక్షల జరిమానా, జట్టు సభ్యుల వేతనంలో కోత పడుతుంది. మూడోసారి కూడా ఇదే రిపీట్ అయితే.. జరిమానాతో పాటు కెప్టెన్ ఓ మ్యాచ్ నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Also Read
Also Read: Siddharth Marriage: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్ద్.. పెళ్లి కూతురు ఎవరంటే?
శుభ్‌మాన్ గిల్ ఇటీవలే గుజరాత్ కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌కు వెళ్లడంతో.. గిల్ గుజరాత్ జట్టు బాధ్యతలు అందుకున్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా తొలి మ్యాచ్‌లో ముంబైపై విజయం సాధించిన గుజరాత్.. చెన్నైతో జరిగిన రెండో మ్యాచ్‌లో ఓడిపోయింది. ముందుగా బౌలింగ్, ఆపై బ్యాటింగ్‌లో తేలిపోయిన గిల్ సేన చెన్నైపై ఘోర పరాజయాన్ని చవిచూసింది.
తాజావార్తలు
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!