Siddharth Marriage: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్ద్.. పెళ్లి కూతురు ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddharth Tie Knot With Aditi Rao Hydari: తమిళ్ హీరో సిద్ధార్ద్ సీక్రెట్‌గా వివాహం చేసుకున్నాడు. హీరోయిన్ అదితి రావ్ హైదరితో సిద్ధార్ద్ ఏడడుగులు వేశాడు. సిద్ధార్ద్, అదితిల వివాహం వనపర్తిలోని శ్రీరంగపురం టెంపుల్‌లో బుధవారం (మార్చి 27న) జరిగింది. ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. తమిళనాడు పురోహితులు పెళ్లి తతంతు జరిపించారు. వనపర్తి సంస్థానాధీశులు కట్టించిన ఆలయంలో పూర్తి ఆంక్షలతో సిద్ధార్ద్, అదితిల వివాహం జరిగింది.
సిద్ధార్ద్, అదితి రావ్ హైదరి గత కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఇటీవలి రోజుల్లో వీరిద్దరూ జంటగా ఫంక్షన్స్‌కి, సినిమాలకి, పార్టీలకి వెళ్లారు. దాంతో పెళ్లి గురించి అడగ్గా.. ఇద్దరు దాటవేస్తూ వచ్చారు. చివరకు సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. విషయం తెలిసిన ఫాన్స్ ఈ నూతన జంటకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సిద్ధార్థ్‌కి అధికారికంగా ఇది రెండో పెళ్లి కాగా.. అదితికి కూడా రెండో వివాహమే.
Also Read
Also Read: Ram Charan Birthday: తండ్రికి తగ్గ తనయుడిగా.. రామ్ చరణ్ మరింత విజయాలు అందుకోవాలి: పవన్ కళ్యాణ్
2003లో మేఘన అనే యువతిని సిద్ధార్థ్ వివాహం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో 2007లో విడిపోయాడు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. అతడి బాధ్యతలను సిద్ధార్థ్ చూసుకుంటున్నాడు. అప్పటినుంచి మరో వివాహం చేసుకోలేదు గానీ.. చాలా మంది హీరోయిన్స్‌తో ఎఫైర్ నడిపాడు. సోహా అలీ ఖాన్, సమంత కూడా ఆ జాబితాలో ఉన్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. చివరకు అదితిని వివాహం చేసుకున్నాడు. సిద్దార్థ్-అదితి కలిసి మహాసముద్రం చిత్రంలో నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే వీరు ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. బాయ్స్, నువ్ వస్తానంటే నేను ఒద్దంటానా, బొమ్మరిల్లు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సిద్దార్థ్ దగ్గరైన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!