NTV Telugu Site icon

Shubman Gill Fine: శుభ్‌మాన్ గిల్‌కు భారీ షాక్.. 12 లక్షల జరిమానా!

Shubman Gill Fine

Shubman Gill Fine

Gujarat Titans Captain Shubman Gill fined RS 12 Lakh: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్‌కు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అతడికి 12 లక్షల రూపాయల జరిమానా విధించింది. మంగళవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్‌ను నమోదుచేసినందుకు గాను గిల్‌కు ఈ ఫైన్ విధించారు. ఈ విషయాన్ని ఐపీఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఐపీఎల్ 2024లో స్లో ఓవర్ రేటు కారణంగా జరిమానా ఎదుర్కొన్న తొలి కెప్టెన్‌గా గిల్‌ నిలిచాడు.

‘ఐపీఎల్ 2024లో భాగంగా మార్చి 26న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ స్లో ఓవర్ రేట్‌ నమోదు చేసింది. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు జరిమానా విధించాం. ఐపీఎల్ నియమావళి మినిమమ్ ఓవర్ రేట్ రూల్స్ ప్రకారం.. గిల్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించాం’ అని ఐపీఎల్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సీజన్‌లో గుజరాత్ జట్టు చేసిన మొదటి నేరం కావడంతో గిల్‌కి రూ. 12 లక్షల జరిమానాతో బయటపడ్డాడు. రెండోసారి ఇలానే జరిగితే రూ. 24 లక్షల జరిమానా, జట్టు సభ్యుల వేతనంలో కోత పడుతుంది. మూడోసారి కూడా ఇదే రిపీట్ అయితే.. జరిమానాతో పాటు కెప్టెన్‌ ఓ మ్యాచ్ నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Also Read: Siddharth Marriage: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్ద్.. పెళ్లి కూతురు ఎవరంటే?

శుభ్‌మాన్ గిల్ ఇటీవలే గుజరాత్ కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌కు వెళ్లడంతో.. గిల్ గుజరాత్ జట్టు బాధ్యతలు అందుకున్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా తొలి మ్యాచ్‌లో ముంబైపై విజయం సాధించిన గుజరాత్.. చెన్నైతో జరిగిన రెండో మ్యాచ్‌లో ఓడిపోయింది. ముందుగా బౌలింగ్, ఆపై బ్యాటింగ్‌లో తేలిపోయిన గిల్ సేన చెన్నైపై ఘోర పరాజయాన్ని చవిచూసింది.

 

Show comments