NTV Telugu Site icon

Shubman Gill: రష్మిక.. ఆమె ఎవరో కూడా నాకు తెలియదు

Rashmika Gill

Rashmika Gill

Shubman Gill: ఒక క్రికెటర్ పేరు నటితో ముడిపెట్టడం మొదటిసారి కాదు. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ-షర్మిలా ఠాగూర్ నుండి విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ వరకు.. తాజాగా కేఎల్ రాహుల్-అథియా శెట్టి కూడా వాటికి సాక్షులు. ఈ ఏడాది జనవరిలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు శుభ్‌మన్ గిల్ రష్మిక విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అతని పేరు తరచుగా సారా అలీ ఖాన్ లేదా మాస్టర్ బ్లాస్టర్ కుమార్తె సారా టెండూల్కర్‌తో ముడిపడి ఉంటుంది. వీటన్నింటి మధ్య ఇటీవల, క్రికెటర్ శుభమాన్ గిల్ తన క్రష్ ఎవరో సోషల్ మీడియాలో పంచుకున్నాడు.. కానీ ఇప్పుడు అతను యు-టర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read Also: IND vs AUS: సచిన్ క్లబ్ లో చేరిన విరాట్ కోహ్లీ

ప్రముఖ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్‌కి రష్మిక మందన అంటే చాలా ఇష్టమని షాక్ ఇచ్చారు. సారా అలీ ఖాన్ లేదా సారా టెండూల్కర్ మాత్రం కాదని, దక్షిణాది సినిమాల్లోని ప్రముఖ నటి తన క్రష్ అంటూ చెప్పుకొచ్చాడు. గిల్ ఇటీవలి ప్రకటన కొంతమందికి నిరాశ కలిగించవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో తన నివేదికపై క్రికెటర్ స్పందిచారు. ఇది మీడియా సంభాషణ ఏమిటో, దాని గురించి రష్మిక ఎవరో నాకు తెలియదన్నారు. సారా,శుభ్‌మాన్ చాలాసార్లు కనిపించారు. సోనమ్ బజ్వా హోస్ట్ చేసిన పంజాబీ చాట్ షో ‘దిల్ దియాన్ గల్లన్’లో కనిపించినప్పుడు.. మీరు సారాతో డేటింగ్ చేస్తున్నారా లేదా అని అడిగారు. దానికి శుభ్‌మాన్ గిల్ సిగ్గుపడుతూ బదులిచ్చారు. బాలీవుడ్‌లో మీకు ఇష్టమైన నటి ఎవరు అంటూ అడిగితే.. క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే సారా అంటూ బదులిచ్చాడు. అలాగే ‘మీరు సారాతో డేటింగ్ చేస్తున్నారా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ, అవును, కాకపోవచ్చు అంటూ సంధిగ్ధంలో పడేశాడు. కాగా శుభ్‌మన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు, వీడియోలను పంచుకుంటుంటాడు. సారా అలీ ఖాన్, శుభ్మాన్ తరచుగా పార్టీలలో కలిసి కనిపిస్తుంటారు. అయితే ఇప్పుడు శుభ్‌మన్ సారాతో డేటింగ్ చేస్తున్నాడా..లేదా అనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు.

Show comments