NTV Telugu Site icon

India Tour of Zimbabwe: జింబాబ్వే పర్యటనకు వెళ్లని శుభ్మన్ గిల్.. కారణమిదే..?

Gill

Gill

టీమిండియా ఈరోజు జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. టీ20 ప్రపంచకప్‌ కారణంగా ఈ టూర్‌కు యువ జట్టును ఎంపిక చేశారు. ఈ టీమ్‌లోని చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్‌లో సత్తా చాటిన ప్లేయ్లకు అవకాశం కల్పించారు. అలాగే.. జట్టు కెప్టెన్సీ పగ్గాలు శుభ్‌మన్ గిల్ చేతికి అందించారు. అయితే.. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. గిల్ జట్టుతో కలిసి జింబాబ్వే వెళ్లలేదు. టీమిండియా జింబాబ్వే పర్యటనకు సంబంధించి బీసీసీఐ తన X హ్యాండిల్ తెలిపింది. NCA చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ జట్టుకు కోచ్‌గా ఉన్నారు. అతను టీమిండియాతో కలిసి జింబాబ్వే పర్యటనకు వెళ్ళాడు. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. ఇప్పుడు జట్టుకు కొత్త కోచ్‌రానున్నాడు. అయితే కొత్త కోచ్ శ్రీలంక పర్యటనలో జట్టుతో చేరతాడు.

Read Also: Kalavedika NTR Film Awards: ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ అందుకున్నది వీరే !

అసలు విషయానికొస్తే.., గిల్ ప్రస్తుతం విరామంలో ఉన్నందున జట్టుతో కలిసి వెళ్లలేదు. ఆయన అమెరికాలో రెస్ట్ తీసుకుంటున్నాడు. టీ20 ప్రపంచకప్-2024కి ఎంపికైన టీమ్ ఇండియా రిజర్వ్ ఆటగాళ్లలో గిల్ ఉన్నాడు. కానీ అమెరికాతో మ్యాచ్ ముగిసిన తర్వాత.. గిల్ జట్టు నుండి విడుదలయ్యాడు. అయినప్పటికీ గిల్ అక్కడే ఉన్నాడు. కాగా.. శుభ్మన్ గిల్ అమెరికా నుండి నేరుగా జింబాబ్వేకి వెళ్లి హరారేలో జట్టులో చేరతాడు.

Read Also: Aditya L1 Mission: ఇస్రో మరో చరిత్ర.. హాలో కక్ష్యను పూర్తి చేసిన ఆదిత్య-ఎల్1

జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో చివరి నిమిషంలో భారత్ మార్పులు చేసింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు ఈ మార్పులు చేశారు. ఈ జట్టులో యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ మరియు శివమ్ దూబే ఉన్నారు. అయితే ఈ ముగ్గురూ టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న టీమ్ ఇండియా సభ్యులు. వీరితో పాటు టీమ్ ఇండియా ప్రస్తుతం తుఫాను కారణంగా బార్బడోస్‌లో చిక్కుకుపోయింది. ఈ కారణంగా ఈ ముగ్గురు జింబాబ్వే పర్యటనకు వెళ్లలేదు. అందుకే రెండు మ్యాచ్‌ల కోసం జట్టులో మార్పులు చేశారు. జితేష్ శర్మ, సాయి సుదర్శన్, హర్షిత్ రాణా జట్టులో స్థానం కల్పించారు.