Shubman Gill snapped with Avneet Kaur in London: వన్డే ప్రపంచకప్ 2023 తర్వాత టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ విశ్రాంతి తీసుకున్నాడు. మెగా టోర్నీ అనంతరం ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆడని గిల్.. ఇటీవల లండన్‌కు వెళ్లాడు. అక్కడి వీధుల్లో స్నేహితులతో కలిసి చక్కర్లు కొట్టాడు. అయితే గిల్ పక్కన బాలీవుడ్ హాట్ నటి అవనీత్ కౌర్ ఉండడం విశేషం. గిల్, అవనీత్ లండన్‌లో దిగిన ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.
శుభ్‌మాన్ గిల్, అవనీత్ కౌర్‌లు ఓ పాట షూటింగ్ కోసం లండన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఓ పంజాబీ ఆల్బమ్ కోసం గిల్, అవనీత్ లండన్‌కు వెళ్లారట. వీరితో పాటు నిర్మాత రాఘవ శర్మ, అన్షుల్ గార్గ్ కూడా ఉన్నారు. వీరంతా కలిసి లండన్ వీధుల్లో ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. భారత జట్టులో ఇప్పటికే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న గిల్.. ఈ పంజాబీ ఆల్బమ్‌లో నటిస్తే అది బంపర్ హిట్ అవడం ఖాయం అని చెప్పొచ్చు.
Also Read: Rohit Sharma Captain: రోహిత్ శర్మనే కెప్టెన్.. కోచ్, సెలెక్టర్ల ఏకగ్రీవ నిర్ణయం!
సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌తో శుభ్‌మన్ గిల్ డేటింగ్ చేస్తున్నాడని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే. గిల్, సారా కలిసి రెస్టారెంట్లకు తిరగడం.. సోషల్ మీడియాలో ఒకరి పోస్టులకు ఒకరు లైకులు కొట్టడం.. గిల్ ఆడే మ్యాచ్‌లకు సారా రావడంతో ఈ ఇరువురి మధ్య సంమ్‌థింగ్ సంమ్‌థింగ్ అని గాసిప్స్ వస్తున్నాయి. అయితే తమ మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌పై ఈ ఇద్దరూ ఇంతవరకూ స్పందించలేదు.