Gill Century Celebration: శుభ్‌మన్ గిల్ సెంచరీ.! ఆనందంతో తండ్రి స్టేడియంలోనే.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gill Century Celebration: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) అద్భుత సెంచరీతో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో గిల్ బ్యాట్‌తో రెచ్చిపోగా.. స్టేడియంలో ఉన్న అతని తండ్రి లక్ష్విందర్ గిల్ చేసిన సెలబ్రేషన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శుభ్‌మన్ గిల్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. అద్భుత టైమింగ్, క్లాస్ షాట్లతో బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. పేస్, స్పిన్ అనే తేడా లేకుండా ప్రతి బౌలర్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ బౌండరీలు సాధించాడు.
ఈ క్రమంలో గిల్ శతకాన్ని పూర్తి చేయగానే స్టేడియం మొత్తం హర్షధ్వానాలతో మార్మోగిపోయింది. ఆ సమయంలో వెంటనే కెమెరాలు ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చున్న అతని కుటుంబ సభ్యులపై ఫోకస్ చేశాయి. ఆ సమయంలో గిల్ తండ్రి లక్ష్విందర్.. దివంగత పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా స్టైల్లో ప్రసిద్ధి చెందిన ‘థై స్లామ్’ సెలబ్రేషన్ చేయడం అభిమానులను ఆకర్షించింది.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ఈ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయింది. ముఖ్యంగా అదే రోజు సిద్ధూ మూసేవాలా వర్ధంతి కావడంతో ఈ సెలబ్రేషన్‌కు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. పంజాబ్ సంగీత ప్రపంచంలో మంచి గుర్తింపు ఉన్న సిద్ధూ మూసేవాలా 2022 మే 29న పంజాబ్ లోని మాన్సా జిల్లాలో దారుణ హత్యకు గురయ్యాడు. ఆయన పాటలు, స్టైల్ ఇప్పటికీ కోట్లాది అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాయి.
తన హోం క్రౌడ్ ముందు ఆడిన గిల్.. ఈ సీజన్లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటిని నమోదు చేశాడు. ఇది గిల్ ఐపీఎల్ కెరీర్లో ఐదో శతకం కావడం విశేషం. ఈ ఇన్నింగ్స్‌తో గిల్ ఐపీఎల్ 2026 సీజన్లో 700 పరుగుల మార్క్‌ను కూడా దాటాడు. సీజన్ మొత్తం అద్భుత ఫామ్ కొనసాగిస్తున్న గిల్.. మరోసారి తన క్లాస్‌ను నిరూపిస్తూ గుజరాత్ టైటాన్స్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లాడు. ఆదివారం నాడు RCBతో గుజరాత్ టైటాన్స్ టైటిల్ పోరులో అమితుమీ తేల్చుకోనుంది.
A 1️⃣0️⃣0️⃣ of the highest quality! 🤩🔥👏
GT skipper #ShubmanGill brings up a sensational century and what an occasion to deliver this masterclass! ❤️🙌#TATAIPL Qualifier 2 👉 #GTvRR | LIVE NOW 👉https://t.co/pv6LOaRl1f pic.twitter.com/wEbwNXzply
— Star Sports (@StarSportsIndia) May 29, 2026
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!