Site icon NTV Telugu

Shruti Haasan : విడాకులు నాకు జీవిత పాఠం నేర్పాయి.. శృతి హాసన్

Sruthihasson

Sruthihasson

లోకనాయకుడు కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి హాసన్, ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే, వెండితెరపై ఆమె గ్లామర్ వెనుక ఎంతో కష్టం.. భావోద్వేగమైన గతం ఉందని ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. తన తల్లిదండ్రులు కమల్ హాసన్ – సారిక విడిపోవడం తన జీవితాన్ని ఎలా మార్చేసిందో శృతి వివరించారు.

Also Read : Allu Arjun& NTR : సైలెన్స్ వీడాలి.. అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్!

తల్లిదండ్రుల విడాకుల తర్వాత తన జీవితం ఒక్కసారిగా తలకిందులైందని శృతి చెప్పారు. ‘చెన్నైలో మెర్సిడెస్ బెంజ్ కార్లలో తిరిగిన నేను, అమ్మతో కలిసి ముంబై వచ్చాక లోకల్ ట్రైన్లలో ప్రయాణించాల్సి వచ్చింది. లగ్జరీ జీవితాన్ని, అలాగే కష్టాలను కూడా చూశాను’ అని ఆమె తెలిపారు. అయితే, ఈ విడాకులు తనకు ఒక గొప్ప జీవిత పాఠాన్ని నేర్పాయని ఆమె అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఒక స్త్రీ ఆర్థికంగా, మానసికంగా స్వతంత్రంగా ఉండటం ఎంత ముఖ్యమో తనకు అప్పుడే అర్థమైందని చెప్పుకొచ్చింది.. ‘ఇద్దరు వ్యక్తులు కలిసి సంతోషంగా ఉండలేనప్పుడు, బలవంతంగా ఒకే ఇంట్లో ఉండి నరకం అనుభవించడం కంటే.. విడిపోయి విడిగా సంతోషంగా ఉండటమే మంచిది. అందుకే వారు విడిపోయినందుకు నేను ఒక రకంగా సంతోషించాను’ అని శృతి హాసన్ కుండబద్దలు కొట్టారు. మొదట్లో ‘ఐరన్ లెగ్’ అని విమర్శలు ఎదుర్కొన్నా, తన కష్టంతో నేడు దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒకరిగా నిలవడం విశేషం. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.

Exit mobile version