Site icon NTV Telugu

Shriya Saran : ఆ స్టార్ హీరో తో సినిమాను కావాలనే వదులుకున్న శ్రీయా…?

In Pics Shriya Saran Is Surreal Personified In Saree 11

In Pics Shriya Saran Is Surreal Personified In Saree 11

శ్రియా శరన్… ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అందరి స్టార్ హీరో ల సరసన నటించి మంచి గుర్తింపు ను తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.
టాలీవుడ్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్ మరియు కోలీవుడ్ సినిమాల లో కూడా నటించి అక్కడ కూడా స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది.ప్రస్తుతం కొన్ని సినిమాల లో నటిస్తూ ఫ్యామిలీ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందరూ హీరోల తో కలిసి నటించిన ఈ అమ్మడు ఒక హీరోతో నటించే ఛాన్స్ ని మాత్రం కావాలనే వదులుకుందని సమాచారం. అయితే ఆ హీరోతో నటించే అవకాశం వచ్చినా శ్రియా కావాలనే రిజెక్ట్ చేయడానికి ప్రధాన కారణం కూడా వుంది.

ఆ హీరో శ్రియ కన్నా కొద్దిగా పొట్టి గా ఉండటమే అని తెలుస్తుంది.. ఆ హీరో పొట్టిగా ఉన్న కారణంతో తెరపై వీరిద్దరూ కలిసి నటిస్తే ఇద్దరు అక్క, తమ్ముడిగా కనిపిస్తారని ఆ కారణంగానే శ్రియ ఆ హీరో తో కలిసి నటించేందుకు ఇష్టపడలేదని సమాచారం.. ఈ కారణం తప్పితే ఆ హీరో తో శ్రియా నటించకపోవడానికి మరో కారణం లేదంటూ తను క్లారిటీ కూడా ఇచ్చిందట. దాంతో శ్రియా పేరు ఇండస్ట్రీలో మరోసారి హాట్ టాపిక్ గా అయితే మారింది. ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించిన శ్రియా సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ చాలా బిజీగా ఉంది. అలాగే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు తన భర్తకు పిల్లలకు సంబంధించిన ఫోటోలను మరియు వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులకు షేర్ చేస్తూ ఉండేది.. ఇటీవల కాలంలో వరుసగా గ్లామర్ ఫోటో షూట్స్ చేస్తూ తెగ రెచ్చగొడుతుంది.ఈ ఏజ్ లో కూడా శ్రీయా మంచి ఫిజిక్ ను మెయింటైన్ చేస్తూ అలరిస్తూ వుంది. తన వరుస హాట్ ఫొటోలతో కుర్రాళ్ల మతి పోగొడుతుంది శ్రీయా

Exit mobile version