Shreyas Iyer: కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు.. భారత క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shreyas Iyer: టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. భారత క్రికెట్ చరిత్రలో మూడు కంటే ఎక్కువ మ్యాచ్‌లకు సారథ్యం వహించిన 12 మంది కెప్టెన్లలో శ్రేయస్ ఒకడిగా నిలిచాడు. అయితే.. తన కెప్టెన్సీ కెరీర్ ప్రారంభించిన మొదటి నాలుగు మ్యాచ్‌లలో ఒక్క విజయాన్ని సైతం నమోదు చేయలేకపోయిన ఏకైక కెప్టెన్‌గా అయ్యర్ చెత్త రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. అతని నాయకత్వంలో భారత్ గతంలో ఐర్లాండ్‌లో రెండు మ్యాచ్‌లు ఓడిపోగా, ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో మొదటి టీ20 వర్షం వల్ల రద్దయింది. తాజాగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లోనూ భారత్ 4 వికెట్ల తేడాతో ఓటమి చవిచూడటంతో ఇంగ్లాండ్ ఈ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
నిన్నటి మ్యాచ్ విషయానికి వస్తే.. 191 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు ఆరంభంలోనే టీమిండియా బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ గట్టి షాక్ ఇచ్చాడు. మొదటి ఓవర్లోనే ప్రమాదకరమైన ఓపెనర్లు ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్‌లను డకౌట్ చేసి భారత్‌కు మంచి పట్టు సాధించి పెట్టాడు. అయితే, ఆ తర్వాత హ్యారీ బ్రూక్ (39), జాకబ్ బెథెల్ (76), టామ్ బాంటన్ (39) అద్భుత ఇన్నింగ్స్‌లతో మ్యాచ్‌ను భారత్ నుంచి లాగేసుకున్నారు. ఒక దశలో 16 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ విజయానికి 49 పరుగులు కావాలి, ఆస్కింగ్ రన్ రేట్ సైతం దాదాపు 12గా ఉంది. కానీ, స్పిన్నర్ రవి బిష్ణోయ్ వేసిన 17వ ఓవర్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. ఆ ఓవర్లో అతను నో-బాల్‌తో పాటు ఏకంగా 29 పరుగులు సమర్పించుకోవడంతో మ్యాచ్ పూర్తిగా ఇంగ్లాండ్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందిస్తూ.. తాము ఎక్కడ తప్పు చేశామో తనకు తెలుసని, అయితే ఓటమికి ఏ ఒక్క ఆటగాడిని బ్లేమ్ చేయదలుచుకోలేదని అన్నాడు. రవి బిష్ణోయ్ వేసిన 17వ ఓవరే మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అని, ఆ నో-బాల్ వల్ల మ్యాచ్ చేజారిందని ఒప్పుకుంటూనే.. బిష్ణోయ్ ఈ తప్పుల నుంచి నేర్చుకుని బలంగా పునరాగమనం చేస్తాడనే నమ్మకాన్ని వ్యక్తపరిచాడు.
Also Read
- Guntur Chilli Export: గుంటూరు మిర్చికి శ్రీలంక షాక్.. పదుల సంఖ్యలో కంటైనర్లు రిజెక్ట్!
- Car Accident: పెళ్లి సందడి టు విషాదం.. కాలువలోకి దూసుకెళ్లిన కారు, నలుగురు యువకులు గల్లంతు!
- Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. దర్యాప్తు అధికారిగా ఐపీఎస్ ఆఫీసర్!
- PM Modi: ‘దేశం.. ప్రజాస్వామ్యం శాశ్వతంగా వర్ధిల్లాలి’.. వాజ్‌పేయీ సందేశాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని..
తాజావార్తలు
-
Toxic : ‘పాన్ ఇండియా స్టార్’ అనే టైటిల్ శాశ్వతం కాదు.. అది ఏ ఒక్కరి సొత్తు కాదు : యశ్
-
Guntur Chilli Export: గుంటూరు మిర్చికి శ్రీలంక షాక్.. పదుల సంఖ్యలో కంటైనర్లు రిజెక్ట్!
-
Himanshi Khurana: మతం మారమని ప్రియుడి ఒత్తిడి.. దేవుడికి ద్రోహం చేయలేనంటూ.. నటి ప్రేమకథ వెనుక కన్నీటి నిజాలు
-
Varanasi Airport Gunfire: ఎయిర్‌పోర్టులో కాల్పుల కలకలం.. లైసెన్స్డ్ పిస్టల్ పేలడంతో ఇద్దరు సిబ్బందికి గాయాలు
-
Car Accident: పెళ్లి సందడి టు విషాదం.. కాలువలోకి దూసుకెళ్లిన కారు, నలుగురు యువకులు గల్లంతు!
ట్రెండింగ్
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!